లింగోద్భవ కాలం అంటే ఏమిటి ?

Submitted on 21 February 2020
lingodbhava kalam meaning

శివలింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించబడినది. ఒక మహా ప్రళయానంతరం బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎంతవరకు వెళ్ళిందంటే  ఎవరు గొప్పో తేల్చుకొనేంత దాకా వచ్చి యుద్ధానికి దారి తీసింది. ఇరువురు ఒకరిపై ఒకరు పాసుపతాస్త్రాలను ప్రయోగించుకొన్నారు. దీనిని గమనించిన పరమేశ్వరుడు మరో మారు ప్రళయం జరుగకుండా రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో ఆది మధ్యాంతరాలు తెలియరాని విధంగా ఒక మహాగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపజేసి అందులో అందరికి దివ్య దర్శనం ఇచ్చాడు.

  పుష్కలంగా మేఘాలను రప్పించి జలాన్ని వర్షింపజేసి మహాగ్నిస్తంభాన్నిచల్లార్చాడు. అదే శివలింగం. మాఘ బహుళ చతుర్దశినాడు అర్ధరాత్రి సమయంలో ఇది  జరిగింది. కాబట్టి దీనినే లింగోద్భవ కాలం అంటారు. ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకొనేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని, బ్రహ్మదేవుడు హంస రూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకొనేందుకు వెళ్లి దానిని కనుగొనలేక చివరకు పరమేశ్వరుడ్నే శరణు వేడుకొంటారు.

అప్పుడు పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొట్టాడు. శివరాత్రి నాడు ఈ లింగోధ్బవ కాలం ముఖ్యమైనది. కావున అన్ని శివాలయాలలో ఆ రోజు రాత్రి 11 గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో లింగం దర్శనం, స్వామి వారికి చేసే అభిషేకాల దర్శనం చేసుకుంటే మహా పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఈ సమయంలో స్వామి వారిని బిల్వ పత్రాలతో పూజించి, పంచామృతాలతో అభిషేకిస్తే సంవత్సర కాలం నిత్య శివారాధన ఫలితం దక్కుతుందని అంటారు.

maha shivaratri celebration
lord shiva
lingodbhavam
Lord Vishnu
lord brahma

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు