9 ఏళ్ళు పూర్తి చేసుకున్న లీడర్

Submitted on 19 February 2019
Leader Movie Completes 9 years-10TV

శేఖర్ కమ్మల డైరెక్షన్‌లో, రానా దగ్గుబాటి హీరోగా పరిచయం అయిన సినిమా, లీడర్.. అప్పటి వరకు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌తో వరస హిట్స్ అందుకున్న శేఖర్ కమ్ముల, పొలిటికల్ బేస్డ్ మూవీ, అందులోనూ కొత్త హీరో, ఎలా ఉంటుందో, ఏంటో అని రకరకాల డౌట్స్ ఉండేవి లీడర్ రిలీజ్ ముందు వరకు.. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ, డీసెంట్ హిట్ అందుకుంది లీడర్.. 2010 ఫిబ్రవరి 19 న రిలీజ్ అయిన లీడర్ 2019 ఫిబ్రవరి 19 నాటికి 9 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతూ, అధికారం కోసం సొంత ఇంట్లో వాళ్ళ మధ్యే ఎలాంటి పోటీ నెలకొంటుంది, సీఎమ్‌గా సామాన్య ప్రజలకు న్యాయం చెయ్యడం ఎలా.. అనే విషయాలతో శేఖర్ కమ్ముల లీడర్ తెరకెక్కించి ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు.

ఫస్ట్ మూవీతోనే రానా కూడా హీరోగా తనకి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనిపించుకున్నాడు. రానా పక్కన ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్స్‌గా నటించారు. సుమన్, సుహాసిని, గొల్లపూడి మారుతీరావు, కోట, రావు రమేష్, సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మిక్కీ జె.మేయర్ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్, విజయ్ సి.కుమార్ ఫోటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఏవీఎమ్ బ్యానర్‌పై ఎమ్.శరవణన్, ఎమ్.ఎస్.గుహన్, అరుణ గుహన్, అపర్ణ గుహన్  నిర్మించారు.

వాచ్ మా తెలుగు తల్లికి మల్లెపూదండ సాంగ్...

Rana Daggubati
Mickey J Meyer
AVM Productions
Sekhar Kammula

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు