ప్రపంచంలోనే అతి పెద్ద విమానం లాంచ్

Submitted on 14 April 2019
Launch the world's largest aircraft strato

స్ట్రాటో లాంచ్ పేరుతో ప్రపంచంలోనే అతి పెద్ద విమానం ఆకాశంలో ఎగిరింది. పేరుకు తగ్గట్లుగానే వాతావరణంలోని మూడు ఆవరణాలలో ఒకటైన స్ట్రాటో జోన్‌లోకి వెళ్లి రాకెట్లను ప్రయోగించడానికి దీనిని తయారు చేసారు. గంటకి 304 కిలోమీటర్ల వేగంతో..17వేల ఎత్తుకు ఎగరడంతో దీని ప్రాథమిక లక్ష్యం పూర్తైంది. రెండు విమానాలను అతికించినట్లుగా కన్పించే స్ట్రాటో లాంచ్‌లో ఆరు ఇంజన్లను అమర్చారు. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ పాల్ అలెన్ 2011లో స్ట్రాట్ లాంచ్‌కి రూపకల్పన చేశారు.

భూఉపరితలం నుంచి కాకుండా..నేరుగా గాల్లోంచే శాటిలైట్లను ఆకాశంలో ప్రవేశపెట్టేందుకోసం ఈ స్ట్రాటోలాంచ్ తయారు చేసినట్లు చెప్తున్నారు. ప్రస్తుతానికి ప్రాథమిక పరీక్ష మాత్రమే నిర్వహించారు..అన్ని రకాల అనుమతులు పూర్తైన తర్వాత అసలు ప్రయోగానికి సిద్ధమవుతారు. 
 

world largest
Aircraft
strato
Launch

మరిన్ని వార్తలు