కోటిపై చర్యలు తీసుకోండి : డీజీపీకి లక్ష్మీపార్వతి ఫిర్యాదు

Submitted on 15 April 2019
lakshmi parvathi compalints on koti to dgp

హైదరాబాద్ : వైసీపీ నేత లక్ష్మీపార్వతి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా కోటి అనే వ్యక్తి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి, అసత్య ఆరోపణలు చేసిన కోటిపై కఠిన చర్యలు తీసుకోవాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు.

తనలాంటి వ్యక్తికే ఇంత అవమానం జరిగితే.. సామాన్య స్త్రీల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. డీజీపీ సీపీతో మాట్లాడారని, కేసు ఫైల్ చెయ్యమని చెప్పారని లక్ష్మీపార్వతి మీడియాతో అన్నారు. 60 ఏళ్ల వయసున్న మహిళలను కూడా ఈ విధంగా అవమానించడం దారునం అని లక్ష్మీపార్వతి అన్నారు. తన పరువు, మర్యాదలు కాపాడాలని లక్ష్మీపార్వతి డీజీపీని కోరారు.
Read Also : వరల్డ్ కప్ భారత జట్టు బలాబలాలు

ఇది రాజకీయ కుట్ర అని లక్ష్మీపార్వతి ఆరోపించారు. కోటి వెనుక ఎవరో ఉండి కుట్రలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కోటితో పాటు తప్పుడు వార్తలు ప్రసారం చేసిన మీడియా ఛానల్, యాంకర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డీజీపిని కోరారు. కోటిని బిడ్డగా భావించానని, అతను ఇలా చేస్తాడనుకోలేదని లక్ష్మీపార్వతి వాపోయారు. ఏప్రిల్ 4వ తేదీన లక్ష్మీపార్వతిపై కోటి అనే యువకుడు గుంటూరు జిల్లా వినుకొండ  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లక్షీపార్వతి తనని లైంగికంగా వేధిస్తుందని కంప్లయింట్ చేయడం సంచలనం రేపింది.

వైసీపీలో చేరాలని, జగన్ తో మాట్లాడి మంచి పదవి ఇప్పిస్తానని లక్ష్మీపార్వతి వేధిస్తున్నారని కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోటి తెలిపాడు. లక్ష్మీపార్వతి తనకు పంపిన వాట్సాప్ సందేశాలను, ఇతర సాక్ష్యాలను పోలీసులకు అందజేసినట్టు వార్తలొచ్చాయి. లక్ష్మీపార్వతి, వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోటి కోరినట్టు సమాచారం.
Read Also : టీ షర్ట్ వేసుకుందని ‘పరువు’హత్య

Lakshmi Parvathi
DGP
Koti
social media
allegations
TDP
chandrabbau
Ys Jagan
Ysrcp

మరిన్ని వార్తలు