Shahid Afridi tests positive for Covid-19

సంగారెడ్డి జిల్లా కందిలో ఉద్రిక్తత, పోలీసులపై వలస కూలీల దాడి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సంగారెడ్డి జిల్లా కందిలో ఉద్రిక్తత నెలకొంది. ఐఐటీ హైదరాబాద్ భవనాల నిర్మాణ కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. తమను స్వగ్రామాలకు పంపాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఐఐటీ నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. నాలుగు రోజులుగా  తమకు భోజనం అందడం లేదని కార్మికులు నిరసనకు దిగారు. రంగంలోకి దిగని పోలీసులు వారికి సర్ది చెప్పబోయారు. వినిపించుకోని కార్మికులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసు వాహనం ధ్వంసం చేశారు.

కందిలో ఐఐటీ హైదరాబాద్ భవనాల నిర్మాణ పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి 1600 మంది కార్మికులు వచ్చారు. లాక్ డౌన్ కారణంగా గత నెలరోజులకు పైగా వారంతా అక్కడే చిక్కుకు పోయారు. యజమాని సంగారెడ్డి కంది ఐఐటీ దగ్గరే కార్మికులను ఉంచారు. గత నెలరోజులుగా ఉపాధి లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో కూలీలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలో బుధవారం(ఏప్రిల్ 29,2020) ఉదయం కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. తమను సొంతూళ్లకు పంపాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు.
అక్కడికి చేరుకున్న పోలీసులపై రాళ్లు, కట్టెలతో దాడికి యత్నించారు. కార్మికుల రాళ్ల దాడిలో పోలీసు వాహనాలు ధ్వంస మయ్యాయి. రాళ్లు, కట్టెలు పట్టుకుని తిరుగుతూ బీభత్సం సృష్టించారు. ఘటనా స్థలికి పోలీసు బలగాలు భారీగా చేరుకోవడంతో కార్మికులు వెనక్కి తగ్గారు. వలస కూలీల ఆందోళనతో కంది ఐఐటీ దగ్గర ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. సామాజిక దూరం పాటించాలని పాటించాలని పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా వందలాది మంది కూలీలు ఓకే చోటకు చేరారు.
కూలీల దాడిలో పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి. ఓ పోలీస్ జీపును కార్మికులు ధ్వంసం చేశారు. ముందు జాగ్రత్తగా ఐఐటీ హైదరాబాద్ గేటు ముందు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

Related Posts

Trending

Latest News