'సరిలేరు నీకెవ్వరు' : ఆర్ఎఫ్‌సీలో కొండారెడ్డి బురుజు సెట్

Submitted on 23 September 2019
Kurnool Kondareddy Buruzu set in Ramoji FilmCity

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.. 'సరిలేరు నీకెవ్వరు'.. మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్‌ అజయ్ కృష్ణగా కనిపించనున్నాడు. ఇటీవలే దాదాపు 35 నిమిషాల పాటు హిలేరియస్‌గా సాగే ట్రైన్ ఎపిసోడ్ చిత్రీకరించారు.

ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా వేసిన కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్ దగ్గర కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. కొండారెడ్డి బురుజు అనగానే మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఒక్కడు సినిమాలో మహేష్, ప్రకాష్ రాజ్‌ని కొడితే ట్రాన్స్‌ఫార్మర్‌కి తగిలే షాట్ గుర్తొస్తుంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత మహేష్ సినిమాలో మళ్లీ కొండారెడ్డి బురుజు కనిపించనుంది.

Read Also : విక్రమ్ భట్ ఘోస్ట్ - ట్రైలర్..

రీసెంట్‌గా మహేష్ కొండారెడ్డి బురుజు దగ్గర నిలబడి ఉన్న పిక్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది మూవీ యూనిట్. లేడీ అమితాబ్ విజయశాంతి, బండ్ల గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 2020 సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Mahesh Babu
Rashmika
Devi Sri Prasad
Anil Ravipudi
Sankranthi 2020

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు