నాన్న ఉరేసుకుని చనిపోయారు : కోడెల కుమార్తె

Submitted on 16 September 2019
kodela daughter statement on kodela sucide

మా నాన్న కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని స్టేట్ మెంట్ ఇచ్చింది అతని కుమార్తె విజయలక్ష్మి. ఎలాంటి సూసైడ్ లెటర్ రాయలేదని పోలీసులకు స్పష్టం చేసిందామె. హ్యాంగింగ్ కు తాడుతో మెడను బిగించుకుని చనిపోయినట్లు చెబుతోందామె. సెప్టెంబర్ 16వ తేదీ ఉదయం అమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాం.. ఆ సమయంలో ఇంటిలోని ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లిన నాన్న.. అరగంట తర్వాత కూడా కిందికి రాలేదు.

అనుమానం వచ్చి పైకి వెళ్లాం. ఉరేసుకుని కనిపించారు. షాక్ అయ్యాం. గన్ మెన్, డ్రైవర్ సాయంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు వివరించింది కుమార్తె విజయలక్ష్మి. నాన్న మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో వివరించిందామె.

కొన్నాళ్లుగా నాన్న తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని స్పష్టం చేసింది. చాలా రోజులుగా వరసగా జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పుకొచ్చింది. మానసిక ఒత్తిడిలో ఉన్నారని తెలిపింది.

Andhra Pradesh
Kodela Shiva Prasad
Sucide
hanging
Vijayalakshmi

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు