రక్త శుద్ధికి వెళ్తే కిడ్నీ దొబ్బేశారు

Submitted on 14 March 2019
KIDNEY STOLEN FROM 17 YEARS OLD BOY


రోడ్డు పక్కన దొరికే ఇడ్లీలా మారిపోయింది కిడ్నీ అంటే.. అవయవాలను మనుషులకు తెలియకుండానే మాయం చేసే వైద్యులు ఉన్నంత కాలం నిజమేనేమో అనిపిస్తుంది. తమిళనాడులోని ఓ 17ఏళ్ల కుర్రాడి కిడ్నీని అనుమతి లేకుండానే తీసేశారని బాధితుడి తల్లి మధురై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

పోలీసుల ప్రాథమిక విచారణలో కిడ్నీ తొలగించినట్లుగా తేలింది. బాధిత యువకుడు 'బ్లడ్ ఇన్‌ఫెక్షన్' చికిత్స కోసం ప్రైవేట్ డాక్టర్‌ను కలిశాడు. నవంబర్ 2017లో జరిగిన ఆపరేషన్‌లో అతని కిడ్నీ తొలగించారు. కాగా, ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాధితుడి తల్లి పోలీస్ కమిషనర్ డేవిడ్‌సన్‌ను కలిసి కంప్లైంట్ ఇచ్చారు. 
Read Also : #RRR మూవీ అద్భుతంగా ఉంటుంది : ఎన్టీఆర్

ఈ విషయంపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌ను ఏర్పాటు చేసి సీనియర్ పోలీస్ ఆఫీసర్లకు కేసును అప్పగించింది. డాక్టర్ పలనిరాజన్ ఆఫ్ శాస్త కిడ్నీ అండ్ మల్లీ స్పెషాలిటీ హాస్పిటలో పని చేస్తున్న డాక్టర్ అతని భార్య కలిసి ఆపరేషన్ చేసి బాధితుడి దగ్గర నుంచి కిడ్నీ తొలగించి మరో వ్యక్తికి అమర్చారు. బాధితుడి తల్లి, తండ్రితో కలిసి ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 420, 506, ఇండియన్ పీనల్ కోడ్ 18, 19, 20 పేరిట కేసు ఫైల్ చేశారు. 

డాక్టర్లు మాత్రం తాము బాధితుడి నుంచి అనుమతి తీసుకునే కిడ్నీ మార్పిడి చేశామని.. వాళ్లిద్దరి మధ్యలో డబ్బుల లావాదేవీలు కూడా జరిగాయంటూ మీడియా ముందు చెప్పుకొచ్చారు.  
Read Also : అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కలిస్తే #RRR మూవీ

Kidney Patients

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు