ఎంత అదృష్టవంతులో : 300రూపాయలతో లాటరీ టిక్కెట్ కొంటే 12కోట్లు వచ్చాయి

Submitted on 19 September 2019
Kerala Thiruvonam Bumper Lottery Results: Rs 12 crore lottery jackpot goes to six jewellery employees in Kollam

కేరళలో జ్యూవెలరీ షాపులో పనిచేసే ఆరుగురు ఉద్యోగులు ఐదు నిమిషాల్లో కోటీశ్వరులైపోయారు. ఒక్క లాటరీ టిక్కెట్ వారి జీవితాల్ని మార్చివేసింది. సరదాగా కొన్న లాటరీ టిక్కెట్ వారిని కోటీశ్వరులని చేసింది. కేరళలోని కొల్లం జిల్లాలోని కరునాగపల్లిలోని చున్ కాత్ జ్యూవెలరీ స్టోర్ లో పనిచేసే సుబిన్ థామస్,రామ్ జిన్, రాజీవన్, రతీష్, రోనీ, వివేక్ లకు లాటరీ టిక్కెట్లు కొనడం సరదా. ఎప్పుడూ లాటరీ టిక్కెట్ లు కొంటుంటారు.

ఈ క్రమంలో 300 రూపాయల తిరువోన్నమ్ బంపర్ లాటరీ టిక్కెట్ ను ఏజెంట్ దగ్గర కొన్నారు. ఆరుగురు తలా 50రూపాయలు వేసుకుని లాటరీ టిక్కెట్ కొన్నారు. గురువారం(సెప్టెంబర్-19,2019)మధ్యాహ్నాం లాటరీ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఆరుగురు కొన్న లాటరీ టిక్కెట్ TM 160869కు 12కోట్లు వచ్చాయి. దీంతో ఈ ఆరుగురు తమ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నారు.

తాము సరదాగా 300రూపాయలు ఖర్చు చేసి టిక్కెట్ కొంటే 12కోట్లు వచ్చాయని సంతోషం ఆపుకోలేకపోతున్నట్లు వివేక్ తెలిపాడు. తాము ఇప్పటికీ ఇదంతా నిజం అని నమ్మకలేకపోతున్నామని తెలిపాడు. రాబోయే 12కోట్లతో ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నట్లు సుబిన్ థామస్ తెలిపారు.

రూ .12 కోట్ల జాక్‌పాట్ విజేతలకు ఏజెన్సీ కమీషన్లు, పన్నులను తగ్గించిన తరువాత రూ .6.18 కోట్లు లభిస్తాయి. రెండవ, మూడవ,నాల్గవ బహుమతులు వరుసగా 5 కోట్లు, రూ .2 కోట్లు, 1 కోటి నగదు పురస్కారాలను కలిగి ఉన్నాయి. 12 కోట్లు గెల్చిన గెలిచిన టిక్కెట్  ప్రధాన డీలర్‌ ను అలప్పుజలోని శ్రీమురుగ లాటరీ ఏజెన్సీకి చెందిన శివన్‌కుట్టి గా గుర్తించారు.

అయితే కేరళలోని రాష్ట్రంలోని అతిపెద్ద లాటరీలలో తిరువోనం బంపర్ ప్రతి ఏటా 2కోట్లు,4కోట్లు,5కోట్లు లాటరీ అమోంట్ ఇచ్చేదని, కానీ ఈ సారి 12కోట్లతో తిరువోనం బంపర్ లాటరీ బాగా పాపులర్ అయ్యిందని, అంచనా వేసిన 46 లక్షల టికెట్లలో 95% పైగా గురువారం ముందే అమ్ముడయ్యాయని. టికెట్ల అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అధిక ఆదాయాన్ని పొందనుందని తరచూ ఈ లాటరీ టిక్కెట్ లు కొనే  కోజికోడ్ కి చెందిన సుబిన్ పీకే తెలిపారు.

kerala
lottery
THIRUVONAM BUMPER
onam
12CRORE
PRIZE
Ticket
JEWELLERY EMPLOYEES
Kollam
SUBIN

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు