బస్సును అరెస్ట్ చేసిన పోలీసులు

Submitted on 19 September 2019
KERALA COPS ARREST BUS

కేరళ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిన బస్సుకి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి అందరి ప్రాణాలను డ్రైవర్ ెలా రిస్క్ లో పెట్టారో ఆ వీడియోల్ మనం చూడవచ్చు.

కేరళలోని త్రిసూర్ జిల్లాలోని కుతిరన్ సిటీలో బాగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇంతలో సడెన్ గా జానీ అనే పేరుతో ఉన్న ఓ బస్సును మెయిన్ రోడ్ లో నుంచి పక్కకు వెళ్లి పెద్ద కొండల మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఉన్న రోడ్డులోకి తీసుకెళ్లాడు డ్రైవర్. కొంచెం దూరం అలా తీసుకెళ్లి మళ్లీ తిరిగి ట్రాఫిక్ లోకి బస్సును తీసుకొచ్చాడు. ఆ డ్రైవర్ ఎప్పుడు,ఎలా,ఏమి చేస్తాడో అంచనా వేయలేం అనే మళయాల సినిమాలో ఓ సాంగ్ లోని ఓ భాగాన్ని కట్ చేసి ఈ వీడియోకు  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా ఉంచి సోషల్ మీడియాలో వదిలారు త్రిసూర్ పోలీసులు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

డ్రైవర్ లాగిన ప్రమాదకరమైన స్టంట్‌ను హైలైట్ చేయడానికి...మీరు చెప్పండి.. కొంత పరిమితి ఉండాలి అనే కామెడీ క్యాప్షన్ తో ఈ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలోని సంఘటన మూడు రోజుల క్రితం జరిగిందని పీచి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ చెప్పారు. అయితే భయంకరమైన స్టంట్ తర్వాత తిరిగి  ట్రాఫిక్‌లో చేరిన వెంటనే వీడియోలో చూసినట్లుగా, డ్రైవర్ ర్యాష్ గా నడిపుతూ ఓ కారును ఢీ కొట్టాడని ఆయన తెలిపారు. బస్సును అదుపులోకి తీసుకొని ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకుగాను  ఐపీసీ సెక్షన్ 279 కింద కేసు బుక్ చేసినట్లు తెలిపారు. మోటారు వాహనాల తనిఖీ తరువాత బుధవారం బస్సును విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

సోషల్ మీడియాలో చాలా మంది పోలీసుల చాతుర్యాన్ని మెచ్చుకున్నారు. ఈ వీడియో విమర్శలను కూడా పొందింది. పాచి రోడ్ గుండా బస్సు ఓవర్‌స్పీడింగ్ చూపించడానికి వీడియో తారుమారు చేయబడిందని అభిప్రాయపడ్డారు. 
దీనిపై కేరళ పోలీసుల కోసం సోషల్ మీడియా పేజీలను నిర్వహించే సీనియర్ సివిల్ పోలీస్ ఆఫీసర్ అరుణ్ బిటి టిఎన్‌ఎమ్‌తో క్లారిటీ ఇచ్చారు. ఆయన
మాట్లాడుతూ....మేము బయట పెట్టిన వీడియో వాస్తవానికి కొన్ని రోజుల క్రితం వైరల్ అయిన రెండు వీడియోలు. బస్సును రాష్ డ్రైవింగ్‌గా చిత్రీకరించడానికి అసలు వీడియో అప్పటికే తారుమారు చేయబడింది. మేము రెండు వీడియోలను కలిసి కుట్టాము, డైలాగులు మరియు సంగీతాన్ని జోడించాము అని తెలిపారు.ఈ పోస్ట్ ద్వారా... ప్రజల జీవితాలను ప్రమాదంలో పడే ప్రమాదకరమైన విన్యాసాలలో పాల్గొనవద్దని వాహనదారులను కోరడం మాత్రమే తమ ఉద్దేశ్యమని తెలిపారు.

kerala
cops
Arrest
Bus
rash driving
PATCHE RODS

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు