బన్నీ ఆలోచన గొప్పది.. ప్రశంసలు కురిపించిన కేరళ సీఎం విజయన్..

Submitted on 9 April 2020
Kerala CM Pinarayi Vijayan Praises Allu Arjun

తమ రాష్ట్రంలో కరోనా నిర్మూలనకు చేయూతనిచ్చిన అల్లు అర్జున్‌ని ప్రత్యేకంగా అభినందించింది కేరళ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాలతో సమానంగా తమను కూడా ఆదుకోవాలన్న బన్నీ ఆలోచన గొప్పదంటూ ప్రశంసించారు కేరళ సీఎం పినరయి విజయన్. లాక్ డౌన్ ప్రకటన వెలువడగానే.. బన్నీ కోటి ఇరవై అయిదు లక్షలు విరాళం ప్రకటించారు.

ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కి పాతిక లక్షలు అందజేశారు. తమకు అందిన సాయాన్ని ధృవీకరించింది కేరళ సర్కార్. బన్నీకి కేరళ ప్రజలు రుణపడివుంటారన్నారు కేరళ సీఎం విజయన్. బన్నీకి తెలుగు రాష్ట్రాలకు ధీటుగా మలయాళ ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ వుంది.

Read Also : కరోనా రిలీఫ్‌కు రూ. 3 కోట్లు.. ‘చంద్రముఖి 2’ అడ్వాన్స్ అలా పంచేశాడు..

Kerala CM Pinarayi Vijayan Praises Allu Arjun

ఆయన సినిమాలకు కేరళలో కూడా చక్కటి వసూళ్లు వస్తాయి. అల్లు అర్జున్ నటించిన దాదాపు అన్ని సినిమాలూ మలయాళంలో కూడా రిలీజ్ అయ్యాయి. అక్కడి ఆడియెన్స్ బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ అని కూడా పిలుచుకుంటారు. గతంలో.. ప్రతిష్టాత్మక పడవ పోటీలకు బన్నీని ముఖ్య అతిథిగా పిలిచి సత్కరించింది కేరళ సర్కార్. ఇప్పుడు కేరళలో కరోనా నివారణకు సాయం ప్రకటించి.. అక్కడి ప్రజలతో పాటు ప్రభుత్వం మెప్పును పొందారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

 

Covid-19
Pinarayi Vijayan
Allu Arjun
praises
donates
25 Lakhs
kerala
CM

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు