హిప్పీ ట్రైలర్ : చందమామ ఆకాశానికి అందం, అమ్మాయిలు జిందగీకి బంధం

Submitted on 9 May 2019
Karthikeya Hippi Movie Trailer

ఆర్‌‌ఎక్స్ 100 మూవీతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వి క్రియేషన్స్ బ్యానర్‌పై, ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మాణంలో, టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెలుగు, తమిళ్‌లో రూపొందుతున్న సినిమా.. హిప్పీ.. దిగంగనా సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరోయిన్స్ కాగా, సీనియర్ నటుడు జె.డి.చక్రవర్తి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా హిప్పీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

ఈ సినిమాలో కార్తికేయ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ప్రజెంట్ యూత్ లైఫ్ స్టైల్‌కి తగ్గట్టు, లవ్ అండ్ లివ్ ఇన్ రిలేషన్ వంటి అంశాలతో హిప్పీ రూపొందుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 'అమ్మాయిలని చందమామతో ఎందుకు పోలుస్తారో తెలుసా? వాళ్ళు ఒకొక్కదినం ఒకొక్కమాదిరి ఉంటారు, ఒకదినం ఎమోషన్స్ ఎక్కువుంటయ్, ఒకదినం తక్కువుంటయ్, చందమామ ఆకాశానికి అందం, అమ్మాయిలు జిందగీకి బంధం'.. అంటూ జె.డి. చెప్పిన డైలాగ్స్ యువతని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆర్.డి.రాజశేఖర్ విజువల్స్, నివాస్ కె.ప్రసన్న ఆర్ఆర్ బాగున్నాయి. త్వరలో హిప్పీ రిలీజ్ కానుంది.

హరితేజ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సుదర్శన్, త్రిశూల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ఎడిటింగ్ : కె.ఎల్. ప్రవీణ్, డైలాగ్స్ : టి.ఎన్.కృష్ణ, కాశి రాజు, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్, కొరియోగ్రఫీ : బృంద, శోభి, ఆర్ట్ : మిలాన్..

వాచ్ హిప్పీ ట్రైలర్..
 

Karthikeya
Digangana Suryavanshi
Jazba Singh
V Creations
TN Krishna

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు