సంకీర్ణ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ : స్పీకర్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీం

Submitted on 11 July 2019
Karnataka Assembly Speaker KR Ramesh Kumar moves Supreme Court seeking more time to deal with the resignation issue of rebel MLAs

రెబల్ ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం కావాలంటూ కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేష్ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే స్పీకర్ పిటిషన్ పై ఇవాళ(జులై-11,2019)విచారించేందుకు సుప్రీం నిరాకరించింది. తాము ఈ పిటిషన్ పై రేపు విచారణ చేపడతామని సుప్రీం తెలిపింది.

 తమ రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ(జులై-11,2019)విచారించింది. ఎమ్మెల్యేల రాజీనామాలపై ఇవాళే నిర్ణయం తీసుకోవాలని కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాయంత్రం 6 లోపు రాజీనామా చేసిన 10మంది జేడీఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు...స్పీకర్ ని కలవాలని కోర్టు చెప్పింది. మరోసారి రాజీనామా పత్రాలు స్పీకర్ కి సమర్పించాలంది.

ముంబై నుంచి బెంగళూరు చేరుకునే వరకు...స్పీకర్ ని కలిసే సమయంలో రెబెల్ ఎమ్మెల్యేలకు తగిన భద్రత కల్పించాలని కర్నాటక డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ముంబైలో ఉంటున్న రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరు బయల్దేరారు.

karnataka
Supreme Court
rebel mla's
resignation
issue
deal
Speaker
meet


మరిన్ని వార్తలు