kapil-dev-new-bold-look-lock-down

కరోనా కష్టాలు : కపిల్ న్యూ లుక్ చూశారా..కటింగ్ చేసిన కూతురు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా కష్టాలు ఇంకెన్ని రోజులు అంటున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని…ప్రముఖుల వరకు ఎంతో మంది అష్టకష్టాలు పడుతున్నారు. భారతదేశం లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడంతో వాణిజ్య సంస్థలు, ఆఫీసులు, వ్యాపారాలు..ఇతర..అన్నీ బంద్ అయిపోయాయి. దీంతో కామన్ మెన్ నుంచి సెలబ్రెటీలు వరకు ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంట్లోనే ఉంటూ తాము ఏమి పనులు చేస్తున్నామో తమ అభిమానులకు తెలియచేస్తున్నారు.

ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేస్తున్నారు. ప్రధాన విషయం ఏమిటంటే హెయిర్ కటింగ్ షాప్స్ బంద్ కావడంతో..చాలా మందికి జట్టు ఏపుగా పెరిగిపోయింది. కొంతమంది తమ ఇంటి వారితో కటింగ్ చేయించుకుంటున్నారు. ఈ జాబితాలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ కూడా చేరిపోయారు. న్యూ లుక్ తో అదరగొడుతున్నారు. తన కూతురు కటింగ్ చేసిందని స్వయంగా కపిల్ వెల్లడించారు.

 

2020, ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడారు. ‘జుట్టు బాగా పెరిగిపోయింది. నా కూతురు (అమియా) ను కటింగ్ చేయాలని చెప్పాను. చాలా చిన్నగా కత్తరించింది. చివరకు గుండు గీయించుకున్నా. ఫ్రెంచ్ బియర్డ్ పెట్టుకున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక లాక్ డౌన్ అనుభవాలు ఎలా ఉన్నాయో కూడా చెప్పారు. ఇంట్లో అన్ని రకాలుగా సహయపడుతున్నా. రోమీ (భార్య) సహాయం చేస్తున్నా. ఇంటి పని, వంట పనులు చేస్తున్నాను..కానీ షూలను మాత్రం పాలిష్ చేయలేకపోతున్నా..అంటూ చెప్పారు కపిల్. ఇక కపిల్ న్యూ లుక్ పై ఫ్యాన్స్, ఇతర క్రికేటర్లు స్పందిస్తున్నారు. 

Related Posts