నాలుగు గెటప్స్ లో కంగనా

Submitted on 15 September 2019
Kangana to sport four different looks in 'Thalaivi'

తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ "తలైవీ" లో బాలీవుడ్ నటి, కాంట్రవర్శీ క్వీన్ కంగనా రౌత్ నటించనుందన్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ మూవీ దీపావ‌ళి త‌ర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. ఏఎల్ విజయ్ డైరక్షన్ లో తెలుగు,తమిళ్,హిందీ బాషల్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది.

అయితేఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం కోసం కంగ‌నా రూ.20 కోట్లు పారితోషికాన్ని డిమాండ్‌ చేస్తోందని టాక్ న‌డుస్తుంది. అంతేకాకుండా ఈ మూవీలో కంగ‌నా నాలుగు పాత్ర‌ల‌లో న‌టించ‌నుంని, దీనికి సంబంధించి హలీవుడ్‌కు చెందిన ప్రముఖ మేకప్‌మెన్‌ జోసన్‌ కాలిన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని నిర్మాత‌లు అంటున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌కి రాక‌ముందు, సినీ ప‌రిశ్ర‌మ‌లో మంచి న‌టిగా రాణిస్తున్న స‌మ‌యంలో, రాజ‌కీయ అరంగేట్రం చేసిన‌ప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇలా నాలుగు గెటప్స్‌లో ఈ మూవీలో కంగ‌నా సంద‌డి చేయ‌నుందని తెలిపారు.

అంతేకాకుండా తమిళ్లో లానే హిందీ వెర్షన్ లో తన పేరుని తలైవిగా ఉంచాలని నిర్మాతలను కంగనా కోరిందట. ప్రస్తుతం జయలలితకు సంబంధించి ఐదు బయోపిక్ లు రెడీ అవుతున్నాయి. ఐరన్ లేడీ పేరుతో తెరకెక్కుతున్కన జయ బయోపిక్ లో నిత్యామీనన్ తలైవి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Kangana
FOUR
different looks
Thalaivi
Captain Marvel
prosthetic expert
Jason Collins

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు