డైరెక్టర్ అట్లీపై కేసు పెట్టిన జూనియర్ ఆర్టిస్ట్

Submitted on 24 April 2019
Junior Artist Complaints Against Director Atlee

రాజా రాణి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అట్లీ, ఆ తర్వాత తేరి (తెలుగులో పోలీసోడు), మెర్సల్ (తెలుగులో అదిరింది) సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అట్లీ ప్రస్తుతం దళపతి విజయ్‌తో ముచ్చటగా మూడవ సినిమా చేస్తున్నాడు. ఇదిలాఉంటే, రీసెంట్‌గా ఒక జూనియర్ ఆర్టిస్ట్ అట్లీపై పోలీస్ కేసు పెట్టడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

కృష్ణా దేవి అనే జూనియర్ ఆర్టిస్ట్ అట్లీపై ఏమని కంప్లైంట్ చేసిందయ్యా అంటే.. విజయ్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా సెట్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌లకు సరైన భోజనం పెట్టడం లేదని, సాటి మనుషులమనే కనీస మర్యాద కూడా ఇవ్వకుండా కుక్కలకంటే హీనంగా చూస్తున్నారని, తనను లొకేషన్ నుండి తరిమి కొట్టారని, మేము మనుషుల్లా కనిపించడం లేదా, అట్లీకిదేమైనా న్యాయంగా ఉందా.. అని వాపోతూ, చెన్నై పోలీసులకు కంప్లైంట్ చేసింది.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. ఈ విషయం గురించి దర్శకుడు అట్లీ, నిర్మాత ఎలా స్పందిస్తారో చూడాలి.

Vijay
Atlee
Junior Artist Complaints Against Director Atlee

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు