ఇంటి నుంచి లైవ్ టెలికాస్ట్ చేస్తుండగా జర్నలిస్టు పక్కనే నిలబడిన కుక్కపిల్ల

Submitted on 9 April 2020
journalist live telecast from home with his Puppy

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న అనేక దేశాలు లాక్ డౌన్ విధించాయి. ప్రజలు ఎవరూ ఇంటినుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాయి. ఈ ఘటన ఇంటి నుంచి పని చేయడం అందరికీ సులువు కాదని నిరూపించింది. మైక్ స్లిఫర్ అనే జర్నలిస్టు ఇంట్లో నుంచే లైవ్ వీడియో చేస్తున్నారు. వాతావారణ పరిస్థితుల గురించి వివరిస్తుండగా కుక్క పిల్ల వచ్చి అతని పక్కనే నిలబడింది. అతను వార్తలు చెప్పడం పూర్తవగానే కెమెరా వైపు సంతోషంగా చూసింది. దీనికి సంబంధించిన క్లిప్పింగ్ ను మైక్ ట్విటర్ లో షేర్ చేశారు.

నెటిజన్లు ఆ వీడియోకు ఫిదా అయిపోయారు. కుక్కపిల్ల అచ్చం నవ్వినట్లే ఉందని అబ్బురపడుతున్నారు. ఈ క్రమంలో తన కుక్కపిల్లతో కలిసి చేసిన వార్తలకు ఎంత రేటింగ్ ఇస్తారని ట్వీట్ చేశారు. దానికి నెటిజన్లు స్పందిస్తూ పదికి పదిచ్చినా తక్కువేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే జర్నలిస్టులకు ఇలాంటి సమస్యలు ఎదురవ్వడం కొత్తేమీ కాదు. (కరోనావైరస్ కాదు.. లాక్డౌన్ చంపేసింది : వ్యసనం, అవమానంతో 100 మందికిపైగా మృతి)

జర్నలిస్టు లైవ్ రికార్డింగ్ చేస్తుండగా అతని తండ్రి చొక్కా లేకుండా తిరగడం, ఓ మహిళా జర్నలిస్టు వార్తలు చెప్తుండగా ఆమె పిల్లలు పదే పదే అంతరాయం కలిగించడం లాంటి నవ్వు తెప్పించే అనేక ఘటనలు ఇదివరకే చూసిన సంగతి తెలిసిందే. 

journalist
live telecast
home
Puppy

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు