జియో యూజర్లకు పండగే : ‘డిజిటల్ ఉడాన్’ ట్రైనింగ్ ప్రొగ్రామ్

Submitted on 3 July 2019
Jio Digital Udaan Literacy Programme Launched in Partnership with Facebook

రిలయన్స్ జియో యూజర్ల కోసం కొత్త డిజిటల్ లిటరసీ ప్రొగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. మొదటిసారి ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునే యూజర్లలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా రిలయన్స్ జియో ఈ డిజిటల్ లిటరసీ ప్రొగ్రామ్‌ను లాంచ్ చేసింది. అదే.. ‘డిజిటల్ ఉడాన్’. జియో ఫోన్, ఫేస్‌బుక్ ఎకోసిస్టమ్ ద్వారా డిజిటల్ ఉడాన్ కార్యక్రమాన్ని వీక్షించేందుకు యూజర్లంతా కనెక్ట్ అయ్యేలా ప్రాథమికంగా జియో ఫోకస్ పెట్టింది. 

ఫేస్‌బుక్ భాగస్వామ్యంతో రిలయన్స్ జియో ఈ డిజిటల్ అవగాహన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 7వేల ప్రాంతాలల్లో 13 రాష్ట్రాల్లోని 200 లొకేషన్లలో జియో డిజిటల్ ఉడాన్ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకోస్తోంది. ఈ ప్రొగ్రామ్ ప్రారంభంలో ఫేస్‌బుక్ కంటెంట్ ద్వారా టార్గెట్ ఆడియన్స్ చేరువయ్యేలా ప్లాన్ చేస్తోంది. ప్రతి శనివారం పది వరకు ప్రాంతీయ భాషల్లో డిజిటల్ అవగాహన శిక్షణ కార్యక్రమాలను వీడియోల ద్వారా అందించనుంది. సమాచారంతో కూడిన కరపత్రాలను యూజర్లకు అందించనుంది. 

మరోవైపు రిలయన్స్ జియో యూజర్లకు అవగాహన కల్పించే దిశగా ముందుకు సాగనుంది. రిలయన్స్ జియో డైరెక్టర్ అకాశ్ అంబానీ మాట్లాడుతూ..‘డిజిటల్ ఉడాన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ఇదో తొలి ప్రయత్నం. రియల్ టైంలో యూజర్లకు ఇంటర్నెట్ వినియోగం, జియో ఫోన్‌లో ఫేస్‌బుక్‌ వినియోగం, ఇంటర్నెట్‌  భద్రతపై అవగాహనకు కార్యక్రమం  సాయపడుతుంది. విద్య, ఎంటర్ టైన్ మెంట్ అందరికి చేరువయ్యేలా చేసేందుకు ఈ ప్రొగ్రామ్‌ను ప్రవేశపెట్టడం జరిగింది’ అని చెప్పారు. 

ఈ డిజిటల్ ప్రొగ్రామ్ ద్వారా దేశంలోని మారుమూల ప్రజలు కూడా ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు వీలుంటుంది. ఆన్ లైన్ ద్వారా ఫైనాన్షియల్ సర్వీసులను, ప్రభుత్వ సర్వీసులను ఎలా యాక్సస్ చేసుకోవాలో డిజిటల్ ఉడాన్ శిక్షణ కార్యక్రమం అవగాహన కల్పించనుంది. ఈ కార్యక్రమంలో ప్రథమంగా ప్రతి శనివారం దేశవ్యాప్తంగా తొలి 200 ప్రాంతాల్లోని యూజర్ల అందరితో జియో ఎగ్జిక్యూటీవ్స్ వీడియోల ద్వారా డిజిటల్, ఇంటర్నెట్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనున్నారు. 

Jio Digital Udaan
 Literacy Programme
Partnership Facebook
first-time users
JioPhone
Facebook app


మరిన్ని వార్తలు