గాల్లో ఉద్యోగాలు : 20 వేల మంది ఉద్యోగులను ఆదుకోండి

Submitted on 15 April 2019
Jet Airways Pilots Urge PM Modi To Help Save 20,000 Jobs, Ask SBI For Funds

ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ తీవ్ర సంక్షోభం ఎదుర్కోంటోంది. మార్చి నెల నుంచి ఎయిర్ వేస్ సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడంతో  జెట్ పైలట్లు విధులకు హాజరుకావడం లేదు. వేతన బకాయిలను చెల్లించాల్సిందిగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యోగులంతా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జెట్ ఎయిర్ వేస్ పైలట్ల సంఘం.. రూ.15వందల కోట్లు నిధులను విడుదల చేయాల్సిందిగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI)ని కోరింది.
Read Also : నోటికి తాళం : యోగీ, మాయావతి ప్రచారంపై ఈసీ నిషేధం

జెట్ ఎయిర్ వేస్ లో 20వేల ఉద్యోగులను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని పైలట్ల సంఘం అభ్యర్థించింది. ట్రేడ్ యూనియన్ సభ్యుల్లో 1,100 మందికిపైగా పైలట్లు SBI నుంచి నిధులు విడుదల అయ్యేలా చూడాలని మోడీని కోరినట్టు న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 

వేతనాలు చెల్లించని కారణంగా ఏప్రిల్ 15న విధులు బహిష్కరించాలని ఆదివారం ట్రేడ్ యూనియన్ నేషనల్ ఏవియేటర్ పైలట్ల సంఘం నిర్ణయించింది. SBI నేతృత్వంలోని లెండర్ల గ్రూపు గతనెలలో ఎయిర్ లైన్ తమ అధీనంలోకి తీసుకుంది. వేతనాల చెల్లింపునకు సంబంధించి నిధులను సమకూర్చేందుకు అంగీకరించింది.

వేతనాల చెల్లింపుపై జెట్ ఎయిర్ వేస్ మేనేజ్ మెంట్ తో గ్రూపు లెండర్ల బృందం సోమవారం (ఏప్రిల్ 15, 2019) సమావేశం కానుంది. ఈ సమావేశంలో జెట్ ఎయిర్ వేస్ వేతనాల చెల్లింపునకు కీలక నిధులు విడుదల చేయాలా లేదా? అనేదానిపై నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. 
Read Also : బాటా ఏంటీ లూటీ : క్యారీ బ్యాగులపై జరిమానా

Jet AirWays
Pilots
pm modi
Save 20
000 Jobs
SBI For Funds   

మరిన్ని వార్తలు