జయలలిత బయోపిక్: క్వీన్ టీజర్.. 'అమ్మ'గా రమ్యకృష్ణ

Submitted on 1 December 2019
Jayalalitha Biopic: Queen Official Teaser

అలనాటి అందాల తార, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ 'క్వీన్'. ఈ వెబ్ సిరీస్‌‌లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్‌గా టీజర్ విడుదల చేసింది చిత్రయూనిట్.  చిన్నప్పటి జయలలిత ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నట్టు ఉన్న షాట్... అలాగేు అన్నాడీఎంకే పార్టీ చిహ్నాన్ని గుర్తుచేస్తూ మూడు రంగుల బోర్డర్‌తో ఉన్న తెల్ల చీరను రమ్యకృష్ణ ధరించి ఉంది. టీజర్లో  డైలాగులు అయితే ఏమీ లేవు.

అయితే ‘స్కూల్‌ డేస్‌లో స్టేట్‌ టాపర్‌, 18 ఏళ్ల వయసుకే స్టార్‌ హీరోయిన్‌, పిన్న వయస్కురాలైన ముఖ్యమంత్రి, మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకునే ‘క్వీన్‌’ మీకోసం వస్తుంది.  #QueenIsComing’ అనే మాటలను అందులో పెట్టారు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో జయలలిత పాత్రను ఇద్దరు నటీమణులు పోషిస్తున్నారు. యంగ్ జయలలితగా అనిఖా సురేంద్రన్ కనిపిస్తారు. రాజకీయ నేతగా ఎదిగిన జయలలిత పాత్రను రమ్యకృష్ణ పోషించారు.

ఈ వెబ్ సిరీస్‌కి గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. ప్రశాంత్ గతంలో ‘కిడారి’ అనే తమిళ సినిమాకు దర్శకత్వం వహించారు.  ఈ నెల 5వ తేదీన ట్రైలర్‌ విడుదల కానుంది. ఇక మరోవైపు కంగనా రనౌత్‌ జయలలితగా నటిస్తుండగా.. తలైవి అనే సినిమా తెరకెక్కతుంది. ఈ సినిమాకి విజయ్ దర్శకుడు.

Queen
Official TeaseR
Ramya Krishnan
Gautham Vasudev Menon

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు