హైదరాబాద్‌కి బుల్లెట్ ట్రైన్

Submitted on 11 June 2019
Japan plans to start bullet train services in 5 more Indian cities

బుల్లెట్ ట్రైన్.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే రైలు. జపాన్ కంపెనీ ఈ బుల్లెట్ ట్రైన్ తయారు చేస్తోంది. మన దేశంలో ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్వరలో హైదరాబాద్ నగరానికి కూడా బుల్లెట్ ట్రైన్ రానుంది. దేశంలోని 5 నగరాల్లో బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చేందుకు జపాన్ కంపెనీ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ తోపాటు ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలని చూస్తోంది.

ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు:
మన దేశంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు చేపట్టిన జేఆర్ సెంట్రల్ సంస్థ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ ఐదు నగరాల్లో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నామని చెప్పింది. చర్చలు ఇంకా మొదలవ్వలేదని సంస్థ అధికారులు చెప్పారు. ముందుగా మన దేశంలో ముంబై-అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని జపాన్ కి చెందిన జేఆర్ సెంట్రల్ సంస్థ చేపట్టింది. ముంబై-అహ్మదాబాద్ మ‌ధ్య మొత్తం 12 స్టేష‌న్లు ఉంటాయి. మ‌హారాష్ట్రలో 155 కిలోమీట‌ర్లు, గుజ‌రాత్‌లో 350 కిలోమీట‌ర్ల మేర హై స్పీడ్ ట్రాక్ ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 21 కిలోమీట‌ర్ల మేర ట‌న్నెల్స్ ఉంటాయి. 

బుల్లెట్ ట్రైన్ ఆలస్యం:
ముంబై-అహ్మదాబాద్ మధ్య 505 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. 12 బిలియన్ డాలర్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. 2017 సెప్టెంబర్ లో ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని షింజో అబే ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. 2015 డిసెంబర్ లో ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య 2 గంటల 7 నిమిషాల్లో ప్రయాణం పూర్తవుతుంది. కాగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం కానుంది. 2022 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అయితే 2023 నాటికి కానీ ప్రాజెక్ట్ పూర్తయ్యేలా లేదు. భూసేకరణలో సమస్యలే దీనికి కారణం అని అధికారులు చెబుతున్నారు.

Japan
Plans
start
bullet train services
india
Cities
Hyderabad

మరిన్ని వార్తలు