ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు : పవన్

Submitted on 14 March 2019
janasena president pawaan kalyan fire on pm modi

రాజమహేంద్రవరం : ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని నిలదీశారు. దేశానికి మోడీ ప్రధాని అయితే మంచి రోజులు వస్తాయనుకున్నామన్నారు. మరి అచ్చేదిన్ ఎక్కడొచ్చింది అని నిలదీశారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. 

చంద్రబాబు మీద కోపం ఉంటే ఆయనపైనే చూపించుకోండి.. ఆంధ్రా ప్రజలపై ఎందుకు చూపిస్తారని ప్రశ్నించారు. ఆంధ్రులు ద్రోహులా? కొందరు చేసిన తప్పులకు అందరినీ ఎందుకు శిక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారితో జగన్ కు దోస్తీ ఎందుకని ప్రశ్నించారు. సగటు సామాన్యుడికి అన్యాయం జరిగితే ఊరుకోనని హెచ్చరించారు. వ్యవస్థను నడపడానికి డబ్బులు కావాలి... కానీ వ్యక్తిగతంగా తనకు డబ్బులు వద్దని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి కాదు.. బతుకు మీద భరోసా ఇవ్వమని యువత అడుగుతుందన్నారు.
 

janasena
Pawan kalyan
fire
pm modi
East Godavari
Public Meeting

మరిన్ని వార్తలు