జేమ్స్ బాండ్ స్టయిల్ : రెండు చక్రాలపై ఆటో డ్రైవింగ్.. టైర్ ఎలా మార్చాడో చూడండి!

Submitted on 23 September 2019
James Bond style, netizens after bizarre tyre changing video goes viral

రెండు చక్రాలపై ఆటో దూసుకెళ్లడం ఎప్పుడైనా చూశారా? గాల్లోనే ఆటోకు మూడో టైర్ మార్చడం ఎప్పుడైనా చూశారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే షాక్ అవుతారు. వన్ సైడ్ గాల్లోకి లేచిన ఆటోను వేగంగా నడుపుతూనే టైర్ మార్చేశాడు.

ఈ వీడియోను హర్ష్ గోయెంకా అనే బిజినెస్ టైకూన్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆటో నడుపుతున్న వ్యక్తి.. ప్యాసెంజర్ సీటులో వచ్చి వెనుక టైర్ మార్చేందుకు ప్రయత్నించడం చూడొచ్చు. 

ఒకవైపు గాల్లోకి లేచిన ఆటోను అలానే డ్రైవ్ చేస్తూ మరోవైపు టైర్ మార్చాడు. రోడ్డుపై వెళ్లే మరో ఆటోలోని వ్యక్తి అతడికి టైర్ ఇవ్వడంతో దాన్ని తన ఆటోకు ఫిక్స్ చేశాడు. చూడటానికే ఎంతో భయానకంగా ఉన్న వీడియోను చూసి నెటిజన్లు.. ఎవరూ ఇలాంటి స్టంట్ చేసేందుకు ప్రయత్నించద్దు.. పిచ్చిగా ఇతడిలా చేస్తే ప్రాణాలు పోతాయి జాగ్రత్త అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు అచ్చం జేమ్స్ బాండ్ స్టయిల్.. బట్ డేంజరస్ స్టంట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోకు 50వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Auto Tyre
Netizens
James Bond style
changing a tyre
third tyre

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు