జగన్ ఢిల్లీ టూర్‌

Submitted on 26 May 2019
Jagan Delhi Tour today

వైసీపీ అధినేత జగన్‌ కాసేపట్లో ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం జగన్‌ తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు. ఆదివారం (మే 26, 2019) ఉదయం 10 గంటల 40 నిమిషాలకు మోడీతో ఆయన సమావేశం అవుతారు. జగన్‌ వెంట సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా హస్తినకు వెళ్లనున్నారు.

ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత తొలిసారి వైసీపీ అధినేత జగన్‌ హస్తినకు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై వైఎస్ జగన్‌ ఈ సందర్భంగా ప్రధానితో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర సాయాన్ని ఆయన కోరనున్నారు. కాగా రాష్ట్ర ఆర్థిక సమస్యలను ఉన్నతాధికారులు ఇప్పటికే జగన్‌కు నివేదించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సమస్యలే ప్రధాన అజెండాగా ప్రధానితో జగన్‌ భేటీ అవుతున్నారు. 

జగన్‌ ఢిల్లీ షెడ్యూల్‌ ఈ విధంగా ఉంది. ఉదయం ఆరున్నర గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 7 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి పయనమవుతారు. 9 గంటల 10 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. 10 గంటల 40 నిమిషాలకు ప్రధాని మోడీతో భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ భవన్‌ వెళ్లనున్నారు. 
 

Jagan
Delhi
Tour
pm modi
meeting

మరిన్ని వార్తలు