ప్రముఖ హీరో బిజినెస్ పార్టనర్స్ పై ఐటీ దాడులు

Submitted on 22 October 2019
it raids on asian cinemas offices

ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ లోని ఏషియన్ సినిమాస్ సంస్థ కార్యాలయాలతో పాటు.. అధినేతలు నారాయణదాస్, సునీల్ నారంగ్ ఇళ్లల్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. వారి సన్నిహితుల నివాసాల్లోనూ తనిఖీలు జరిపారు. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఇటీవలే మహేష్ బాబుతో కలిసి ఏషియన్ సంస్థ ఏఎంబీ మాల్ నిర్మించింది. అల్లు అర్జున్ తో కలిసి మరో మల్టీప్లెక్స్ ను ఈ సంస్థ త్వరలో నిర్మించనుంది. నైజాంలోని పలు ప్రాంతాల్లో ఏషియన్ సినిమా మాల్స్ ఉన్నాయి. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా, శేఖర్ కమ్ములతో ఏషియన్ సంస్థ మూవీ నిర్మిస్తోంది. నైజాంలో భారీ చిత్రాలను పంపిణీ చేస్తోంది. 

ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూషన్ సంస్థగా పేరున్న ఏషియన్ సినిమాస్ ఆఫీసులపై ఐటీ దాడుల వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఐటీ సోదాలతో నిర్మాతలు షాక్ తిన్నారు. గతంలో కూడా ఏషియన్ ఫిల్మ్స్ సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. 

IT Raids
asian cinemas
Hyderabad
asain cinemas offices
Mahesh Babu

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు