సవివరంగా చంద్రయాన్-2 తొలి ఫొటో బయటపెట్టిన ఇస్రో

Submitted on 17 October 2019
ISRO releases first illuminated image of lunar surface captured by Chandrayaan-2

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్ 2 చివరి దశలో కమ్యూనికేషన్ కోల్పోయినప్పటికీ అది పంపిన చిత్రాలు ఇస్రోకు అందాయి. ల్యూనార్ తలానికి చేరేముందు ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్(ఐఐఆర్ఎస్) నుంచి ఫొటో తీసింది. ఈ ఇమేజ్‌ను కొద్ది రోజుల ముందే విడుదల చేసినప్పటికీ ఆ చిత్రం ఆధారంగా దానిని పూర్తి స్థాయిలో పరిశీలించి ఆ తలం యొక్క వివరాలను ప్రకటించింది. 

ఉత్తర అర్థ గోళాన్ని చిత్రీకరించిన ఫొటోలో మనం సోమర్‌ఫెల్డ్, స్టెబిన్స్, కిర్క్‌వుడ్ బిలాలను గుర్తించి ప్రత్యేకంగా వివరించింది. ఐఐఆర్ఎస్ తీసిన ఇమేజ్ ఆధారంగా తలంపై సూర్యుని కాంతి పడుతుండగా దానిని చంద్రుని కాంతి ఎంత వరకూ పరావర్తనం చెందించగలుగుతుందనే వివరాలను వెల్లడించింది. 

ల్యూనార్ తలం ప్రాథమిక విశ్లేషణలో ఐఐఆర్ఎస్ విజయవంతమైంది. సోలార్ రేడియేషన్ పరావర్తనం చెందడంలో పలు దశలను వెల్లడించింది. తలంలోని పలు దశలను సవివరంగా తెలిపింది. జులై 22న ప్రయోగించిన చంద్రయాన్ 2 ఉపగ్రహం సెప్టెంబరు 7న చంద్రుని తలంపై అడుగుపెట్టాల్సి ఉంది. కమ్యూనికేషన్ కోల్పోవడంతో హార్డ్ ల్యాండింగ్ అయి చివరి దశలో ఫెయిలైంది. 

ISRO
lunar surface
CHANDRAYAAN-2

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు