కరేబియన్ లీగ్‌కు భారత్ నుంచి ఒక్కడే

Submitted on 16 May 2019
Irfan Pathan only Indian to enrol 2019 CPL

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2019) సీజన్ ముగిసింది. ఇక కరేబియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ అభిమానులను కనువిందు చేయనుంది. మెగా ఈవెంట్ వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత మొదలుకానుంది. అయినప్పటికీ భారత్ నుంచి ఒక్క ఇర్ఫాన్ పఠాన్ మినహాయించి మరెవ్వరూ లీగ్‌లో సెలక్ట్ కాలేదట. 

20దేశాల నుంచి 536ప్లేయర్లతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సీపీఎల్(కరేబియన్ ప్రీమియర్ లీగ్)లో ఆరు జట్లు ఉంటాయి. 'మా లీగ్‌ను బట్టి చాలా మంది ప్లేయర్లు వారి పేర్లను రిజిష్టర్ చేసుకున్నారు. కరేబియన్ లీగ్‌లో ఆడే ప్లేయర్లంతా మరింత రాణించేందుకు ఎదురుచూస్తున్నారు. ప్రతి సీజన్లోలాగే ఈ సారి లీగ్ అంతే రసవత్తరంగా సాగనుంది' అని సీపీఎల్ టోర్నమెంట్ ఆపరేషన్స్ డైరక్టర్ మిచెల్ హాల్ తెలిపారు. 

అలెక్స్ హాల్స్, రషీద్ ఖాన్, షకీబ్ అల్ హసన్, జోఫ్రా ఆర్చర్, జేపీ డుమినీలతో పాటు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షిమ్రోన్ హెట్‌మేయర్, షై హోప్ కరేబియన్ స్టార్లు ఆడనున్నారు. లీగ్ ఆరంభానికి ముందు చేసిన ప్రకటనలో ఆటగాళ్లను అంటిపెట్టుకున్న పేర్లు, విడుదల చేసిన ప్లేయర్ల జాబితా ఉంచింది. 

ఒక్కో జట్టు వివరాలిలా ఉన్నాయి:

  • ముగ్గురు వెస్టిండియా ప్లేయర్లు, అత్యధికంగా నలుగురు ఉండొచ్చు. 
  • ఒక విదేశీ ప్లేయర్, ఒకవేళ వెస్టిండియన్స్ నలుగుర్ని జట్టులోకి రిటైన్ చేసుకుంటే.. 
  • రిటైన్ చేసుకున్నా లేదా కొనుగోలు చేసుకున్నా.. ఒక ఐసీసీ అమెరికా ప్లేయర్.
  • సీపీఎల్ 2018 టైటిల్‌ను ట్రిన్బాగో నైట్ రైడర్స్ గెలుచుకుంది.
  • సెప్టెంబర్ 4నుంచి అక్టోబర్ 12వరకూ ఈ ఏడాది లీగ్ జరగనుంది. 
irfan pathan
2019 CPL
CPL

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు