ఇరాన్ లో వరదలు...76 మంది మృతి

Submitted on 15 April 2019
Iran Flood says floods 76 people killed

టెహ్రాన్ : భారత్ తో ఎండలు మంట పుట్టిస్తుంటే ఇరాన్ దేశంలో మాత్రం వరదలు ముంచెత్తుతున్నాయి. ఇరాన్ లోని ఫార్స్, హార్మోజోగన్, సిస్టాన్, బలుచిస్థాన్, ఖోరసాన్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. ఈ వరదల ధాటికి 76మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు గల్లంతవ్వగా వందలాదిమంది  గాయాలపాలయ్యారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.  ఈ విషయాన్ని ఇరాన్ అధికారి అహద్ వాజిపేహ్ తెలిపారు. 


ఇరాన్ లోని 25 రాష్ట్రాల్లో సంభవించిన వరదలతో వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు కుటుంబాలు నిరాశ్రయులుగా మిగిలాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇరాన్ అధికారులు వరద సహాయ పనులు చేపట్టారు. నిరాశ్రయులైనవారికి ఆహార వసతి..ఆహారం..మంచినీరు...వంటి మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నారు. వరదల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

IRAN
Floods
76 people
killed
Fars
Hormozogan
Siston
Baluchistan
Khorasan

మరిన్ని వార్తలు