ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు వెళ్లే జట్లు ఇవే..

Submitted on 30 April 2019
IPL playoff qualification 

ఐపీఎల్ 12వ సీజన్‌లో ఎనిమిది ఫ్రాంచైజీలు 12మ్యాచ్‌లు ఆడేశాయి. ప్లే ఆఫ్‌రేసులో అర్హత దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ర్, ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ 1, 2 స్థానాల్లో నిలిచాయి. తర్వాతి రెండు మ్యాచ్‌ల ఫలితాలు నిరాశపర్చినా ప్లే ఆఫ్‌కు పక్కా చేసేసుకున్నాయి. ఇదిలా ఉంటే మిగిలిన 6జట్ల మాటేంటి. రేసు కోసం ఇంకా అవి ఎంతదూరంలో ఉన్నాయనేది పరిశీలిస్తే..
Also Read : నేను మగాడినే నమ్మండి... ఆస్ట్రేలియా క్రికెటర్ ఆవేదన


ముంబై ఇండియన్స్: 
ఆఖరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయినప్పటికీ ముంబై ఇండియన్స్ సేఫ్ సైడ్ ఉన్నట్లే. ప్రస్తుతం 12 మ్యాచ్‌లు ఆడి14పాయింట్లతో కొనసాగతున్న రోహిత్ సేన ఇంకొక్క మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లే ఆఫ్ బరిలో నిలుచున్నట్టే. 2 మ్యాచ్‌లు గెలిస్తే ఇంకా హ్యాపీ. ఒకవేళ 2 మ్యాచ్‌లలోనూ ఓడిపోతే ప్లేఆఫ్ బరిలో స్థానం దక్కుతుంది లేదనేది మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్: 
లీగ్‌లో 12మ్యాచ్‌లు ఆడి 12పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో రెండు మ్యాచ్‌లు ఉండగా, రెండు గెలిస్తేనే ప్లే ఆఫ్‌కు స్థానం దక్కించుకోగలవు. ఒక్కటి గెలిచిందంటే మళ్లీ ముంబై ఇండియన్స్‌తో సమానమవుతోంది. మరోవైపు 12పాయింట్లతో ఆగిపోతే మాత్రం కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్‌ కూడా అవే పాయింట్లు దక్కించుకునే అవకాశం ఉంటుంది. 

కోల్‌కతా నైట్ రైడర్స్:  
కోల్‌కతా నైట్ రైడర్స్ విషయానికొస్తే.. మిగిలిన రెండు మ్యాచ్ లలో విజయం చేజిక్కుంచుకుంటేనే ప్లే ఆఫ్ లోకి వెళ్లగలదు. ప్రస్తుతం +0.100రన్ రేట్‌తో కొనసాగుతుండటం మరో 2విజయాలు అందుకోవడానికి మంచి ప్రోత్సాహంగా ఉంది. కోల్‌కతా.. పంజాబ్, ముంబైను ఓడించి 2మ్యాచ్‌లలో గెలిస్తే హైదరాబాద్ కూడా మరో మ్యాచ్‌లో లీగ్‌లో మరో విజయం దక్కించుకోకపోతే ప్లే ఆఫ్‌లోకి చోటు దక్కుతుంది. 


కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు గతేడాది పరిస్థితే మరోసారి కనిపిస్తోంది. లీగ్ దశలోనే పోరాటాన్ని ముగించే వాతావరణం కనిపిస్తోంది. 12గేమలు ఆడి 10పాయింట్లతో కొనసాగుతుండటంతో పెద్ద చిక్కు వచ్చి పడింది. అశ్విన్ జట్టు రెండు మ్యాచ్‌లలో (కోల్‌కతా, చెన్నై) గెలిచినా.. 14పాయింట్లు మాత్రమే దక్కించుకుంటుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ముంబై,  12 పాయింట్లతో హైదరాబాద్ ఉండడంతో అవి వేర్వేరు మ్యాచ్‌లలో వాటి గెలుపోటములపైనే పంజాబ్ భవితవ్యం ఆధారపడి ఉంది. 


రాజస్థాన్ రాయల్స్: 
రాయల్స్ కెప్టెన్సీ మారినప్పటి నుంచి ఫలితాలు మారిపోయాయి. వరుస వైఫల్యాలకు బ్రేక్ ఇచ్చి విజయాలే దక్కించుకుంటుంది రాయల్స్ టీం. 2మ్యాచ్‌లలో కచ్చితంగా గెలవకపోతే లీగ్ దశ నుంచి తప్పుకోవాల్సిందే. ఇలా గెలిస్తే 14 పాయింట్లు రావడంతో పాటు మిగిలిన జట్లు పంజాబ్, కేకేఆర్, హైదరాబాద్‌లు మ్యాచ్‌లు గెలవకుండా ఓడిపోతేనే ప్లే ఆఫ్‌కు చేరుకోగలదు. 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు:  
వరుసగా 3విజయాలు అందుకుని హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్న ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ పరాజయంతో ప్లే ఆఫ్‌కు ఆశలు కోల్పోయింది. కానీ, ఆర్సీబీకి లీగ్ దశ దాటి ముందుకు వెళ్లాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది. రెండు మ్యాచ్‌లు గెలిచి 12 పాయింట్లు దక్కించుకోవాలి. దాంతో పాటు.. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో ముంబై గెలవాలి. కేకేఆర్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విడివిడి మ్యాచ్‌లలో కేవలం ఒక్క విజయమే అందుకోవాలి. వీటితో భారీ ఆధిక్యంతో గెలుపొందితే నెట్ రన్ రేట్ పెరుగుతుంది. ఇలా పాయింట్లు సమమైనా.. రన్ రేట్ సాయంతో ప్లే ఆఫ్‌కు చేరుకోవచ్చు. 
Also Read : RCBvsRR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

IPL 2019
IPL playoff
IPL 12
srh
MI
KXIP
KKR
rcb
rr

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు