ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్న బీసీసీఐ

Submitted on 15 March 2019
ipl full schedule will be released by bcci

ఎన్నికల షెడ్యూల్ రాకముందే.. ఐపీఎల్ క్రేజ్.. ఏర్పాట్ల దృష్ట్యా 17 మ్యాచ్‌లకు సంబంధించిన 2వారాల షెడ్యూల్‌ను ముందుగానే ప్రకటించింది బీసీసీఐ. మార్చి 10 ఆదివారం ఎన్నికల తేదీలు ప్రకటించి ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా హడావుడి మొదలయ్యేలా చేసింది. ఐపీఎల్ ఆరంభానికి ఇంకా 2వారాలకు పైగా సమయం ఉన్నందున ఇక మిగిలిన షెడ్యూల్‌ను కూడా ప్రకటించేసి పని పూర్తి చేసుకోనుంది బీసీసీఐ. 
Read Also: సుప్రీం ఆదేశాలు : శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేత.. BCCI ఆలోచించు

మార్చి 23న చెన్నై వేదికగా సూపర్ కింగ్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ సీజన్ 12ను ఆరంభించనుంది. వరుస షెడ్యూల్‌లో చివరిగా జరగనున్న మార్చి 31వ తేదీ రెండు మ్యాచ్‌లతో తొలి షెడ్యూల్ పూర్తవుతుంది. ఆ తర్వాత కొనసాగనున్న సీజన్‌కు మిగిలిన షెడ్యూల్‌ను బీసీసీఐ శనివారం ప్రకటించనున్నట్లు సమాచారం. 

ఐపీఎల్ షెడ్యూల్ విడుదల అయిన తర్వాత ప్రమోషనల్ ఈవెంట్లలో భాగంగా ఎనిమిది ఫ్రాంచైజీలు ఒకరిమీదఒకరు కామెంట్లు చేసుకోవడం మొదలుపెట్టారు. మరోవైపు సీజన్ ఆరంభానికి ముందే టిక్కెట్లు అమ్మకాలు జరిపేందుకు ఆన్‌లైన్ బుకింగ్ కౌంటర్‌లు ఎదురుచూస్తున్నాయి.  

IPL
IPL 12
IPL 2019
cricket
BCCI

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు