రాజ్ తరుణ్ మరో అర్జున్ రెడ్డి అయ్యేనా!

Submitted on 30 November 2019
intimate scenes in Iddarilokam Okate

రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా.. దిల్ రాజు సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం: 35గా శిరీష్ నిర్మిస్తున ప్రేమకథా చిత్రం.. ‘ఇద్దరిలోకం ఒకటే’.. (యూ ఆర్ మై హార్ట్ బీట్) ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఫేం జి.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ లుక్ కంప్లీట్‌‌గా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది.

మాస్ లుక్స్‌తో ఇప్పటిదాకా బీ గ్రేడ్ ఆడియెన్స్ అలరించిన రాజ్ తరుణ్ ఈ క్లాస్ లుక్‌తో అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాడు. అంతే కాదు షాలినీ పాండేతో లిప్ లాక్ సీన్స్‌లో నటించడానికి మొదట సిగ్గు పడ్డ రాజ్ తరుణ్.. షాలినీ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో బాగా ఇన్వాల్వ్ అయ్యి నటించాడట. దీంతో ఈ ముద్దు సన్నివేశాలు అర్జున్ రెడ్డి లిప్ లాక్స్‌ని గుర్తు చేసేలా ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

హిట్ కోసం ఆ మాత్రం కష్టపడక తప్పదు కదా.. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఇద్దరిలోకం ఒకటే’ డిసెంబర్లో విడుదల కానుంది. కెమెరా : సమీర్ రెడ్డి, ఎడిటింగ్ : తమ్మిరాజు, మ్యూజిక్ : మిక్కీ జె.మేయర్, మాటలు : అబ్బూరి రవి, సహ నిర్మాతలు : హర్షిత్ రెడ్డి - బెక్కెం వేణుగోపాల్.
 

Raj Tarun
Shalini Pandey
Mickey J Meyer
Dil Raju
G R Krishna

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు