ఆక్సీజ‌న్‌ మూవీ రీమేక్‌ చేస్తున్న కళ్యాణ్ రామ్

Submitted on 24 August 2019
Interesting Update On NKR’s Entha Manchivadavuraa Movie

టాలీవుడ్ హీరో క‌ళ్యాణ్ రామ్ ప్రస్తుతం శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం ఫేమ్ స‌తీష్ వేగేష్న ద‌ర్శ‌క‌త్వంలో తన 17వ సినిమా చేస్తున్నాడు. 'ఎంత మంచివాడ‌వురా' అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా రూపొందుతుంది. 

Read Also : గోపికా కృష్ణులు: శ్రీదేవి.. రామ్ గోపాల్ వర్మ

అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుంది. అదేంటంటే... ఎంత మంచి వాడ‌వురా సినిమా గుజ‌రాతీ సూపర్ హిట్ మూవీ ఆక్సీజ‌న్‌ కి రీమేక్‌ గా తీస్తున్నారట‌. గుజరాతీ వర్షన్ ని తెలుగు నేటివిటీకి అర్ధమయ్యేలా మార్పులు చేసి అందరూ మెచ్చే విధంగా సినిమా రూపొందిస్తున్నారటా.

ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జంటగా మెహ‌రీన్ న‌టిస్తుంది. గోపి సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి వరల్డ్ వైడ్ గా విడుదల చేయాలనుకుంటున్నాం అని తెలిపారు చిత్ర బృందం.

Interesting Update
NKR’s Movie
Entha Manchivadavuraa

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు