ఇన్ఫోసిస్‌కు షాక్ : భారీగా షేర్లు పతనం

Submitted on 22 October 2019
Infosys shares fall heavily

సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు స్టాక్ మార్కెట్‌లో షాక్ తగిలింది. ఇన్ఫోసిస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. మంగళవారం (అక్టోబర్ 22, 2019) ఒక్కరోజే ఆ కంపెనీకి చెందిన షేర్లు 16శాతం పడిపోయాయి. గత ఆరేళ్లలో తొలిసారిగా ఆ కంపెనీ షేర్లు అత్యంత కనిష్టాన్ని నమోదుచేశాయి.ఇన్వెస్టర్లు దాదాపు 53వేల కోట్లు నష్టపోయారు. కంపెనీ సీఈవో స‌లీల్ ప‌రేఖ్ అనైతిక విధానాల‌కు పాల్పడుతున్నారని కొంద‌రు ఉద్యోగులు చేసిన ఆరోప‌ణ‌ల‌తో  స్టాక్ మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్లు భారీగా పడిపోయాయి.

ఆసియాలోనే రెండో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ పై ఉద్యోగులు ఆరోపణలు చేయడం దుమారం రేపింది. కంపెనీ రాబడిని ఎక్కువ చేసి చూపించడానికి ఆయన ప్రయత్నించాడని... అనైతిక అకౌంటింగ్ విధానాలను అనుసరిస్తున్నారని ఆరోపణలు చేశారు. 

కంపెనీ బోర్డుకు ఫిర్యాదు చేయడమే కాదు.. ఆ ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా ఈ మెయిల్స్, వాయిస్ రికార్డింగ్‌లు కూడా పంపారు. దీంతో ఈ ఇష్యూపై విచారణ జరిపేందుకు కంపెనీ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అదే ఇపుడు ఆ కంపెనీలో దుమారాన్నిరేపింది. షేర్ మార్కెట్లో అనూహ్య పతనానికి కారణమైంది.
 

infosys
Shares
fall
heavily
Market

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు