లక్ష కిలోమీటర్లు పూర్తి చేసుకున్న 'వందే భారత్' ఎక్స్ ప్రెస్

Submitted on 16 May 2019
India's fastest Vande Bharat Express clocks 1 lakh running km

మేకిన్ ఇండియా ఇన్షియేటివ్‌గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు’ లక్ష కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ రైలు ప్రారంభోత్సవం జరిగింది. 

3నెలలుగా ఒక్క ట్రిప్‌లోనూ విరామం తీసుకోకుండా ఢిల్లీ-వారణాసి మధ్య రాకపోకలు సాగించి మే15 బుధవారం చేరుకుంది. ఈ ప్రయాణం ముగిసేసరికి కాన్పూర్ సమీపంలో రైలు లక్ష కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుంది. 

చూసేందుకు బుల్లెట్ రైలు షేపులో కనిపించే ట్రైన్ మరిన్ని ప్రత్యేకతలతో నిండిఉంది. అన్నీ బోగీలోను ఏసీలు, ఆటోమేటిక్ డోర్లు, ఆన్-బోర్డు వైఫై, GPS-ఆధారిత ప్రయాణీకులకు ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీస్, టచ్-ఫ్రీ బయో-వాక్యూమ్ టాయిలెట్, LED లైటింగ్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు,వాతావరణ నియంత్రణ వ్యవస్థ, 360 డిగ్రీల కోణంలో తిరుగే సీట్లు ఇలాంటి సదుపాయలు ఎన్నో ఉన్నాయి. 

‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌‘ రైలు లక్ష కిలోమీటర్లను పూర్తిచేసుకుందనే సమాచారాన్ని రైల్వే ప్రత్యేక అధికారి వెల్లడించారు. 

Delhi
India's fastestes
VANDE BHARAT EXPRESS
clocks
1 lakh running km

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు