అమెరికాలో మన వాళ్ల ఉద్యోగాలు ఉఫ్

Submitted on 5 April 2020
Indians and Telugu Employees lost jobs in US, due to effect of  Coronavirus Crisis

అమెరికాలో కరోనా సంక్షోభంతో భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా? అనే భయం కనిపిస్తోంది. ఇప్పటివరకూ కోటి ఉద్యోగాలు పోయాయినట్టు వార్తలు వస్తున్నాయి...నెలాఖరులో మరో రెండు కోట్లు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు.. అమెరికాలో దాదాపు 4 లక్షల H1b వీసా ఉన్నవాళ్లు ఉంటే... అందులో సగం మంది తెలుగువాళ్లు ఇండియన్స్ ఉన్నారు.

భారతీయ హెచ్ 1బి ఉద్యోగులపై ప్రభావం ఉండబోతుందా? తప్పక ఉంటుందని అంటున్నారు ‘తానా’అధ్యక్షుడు తాళ్లూరి జయ్. అమెరికాలో ప్రస్తుత పరిస్థితులపై తాళ్లూరి ఎక్సూక్లూజీవ్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై ప్రస్తావించారు.

ఐటీ ఉద్యోగాలు కూడా తొలగించే అవకాశం : 
అమెరికాలో ఎకానమీ పెరిగినా తగ్గినా ప్రభావం సాఫ్ట్ వేర్ ఉద్యోగాలపైనే పడుతుందని అన్నారు. సాఫ్ట్ వేర్ సంస్థలు ఉద్యోగాలను తొలగించే అవకాశం ఉందని, ప్రతి చిన్న వ్యాపారానికి రెండున్నర నెలల జీతాలు ఉచితంగా ఇస్తున్నారని చెప్పారు. కరోనా వైరస్ పిరియడ్ దాటేవరకు ఉద్యోగాలను కాపాడేందుకు ఈ వేతనాలు ఇస్తున్న పరిస్థితి ఉందన్నారు. రెండు నెలల తర్వాత పరిశీలిస్తే.. ఏం జరుగుతుంది అనేది చెప్పలేమన్నారు. నిరుద్యోగం పెరగకుండా ఉండేలా అక్కడి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై భారత్ ఎకానమీపై కూడా భారీగా ప్రభావం పడే అవకాశం ఉందని తాళ్లూరి అభిప్రాయపడ్డారు.

ఆకలి చావులు, ఊడిన ఉద్యోగాలు.. భవిష్యత్ ఇదేనా !
ఒకవైపు కరోనా సంక్షోభంతో ఆకలి చావులు.. ఉద్యోగాలు కోల్పోయివారి పరిస్థితి మరింత దయనీయంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే భవిష్యత్తులో భారతీయ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ప్రశ్నార్థంగా కనిపిస్తోంది. కరోనా వ్యాప్తితో అల్లాడిపోతున్న అమెరికాలో భారత, తెలుగు ఉద్యోగులకు, ఇండియాలో పనిచేసే ఐటీ ఉద్యోగులకు వారి ఉద్యోగాల విషయంలో భరోసా ఇవ్వలేమా అంటే.. ఆ పరిస్థితి లేదన్నారు తాళ్లూరి.. ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో పోయే అవకాశం ఉందని చెప్పారు.

2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీతో కొంత సమస్య రాక పోవచ్చునని అన్నారు. H1b ఉద్యోగాలపై ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం లేదని చెప్పారు. చాలా ఉద్యోగాలు పోయే అవకాశం ఉందన్నారు. కొన్ని కంపెనీల్లో 1500 ఉద్యోగాలు పోయాయని, ఎయిర్ కెనాడాలో 1500 ఉద్యోగాలు కోత విధిస్తున్నట్టు తెలిపారు. యునైటెడ్ ఎయిర్ లైన్స్, ట్రావెల్ ఇండస్ట్రీలో కూడా ఉద్యోగాల కోతను విధిస్తున్నాయని చెప్పారు.  

హెచ్1బి, తెలుగు వారి 10 శాతం ఉద్యోగాలు పోయినట్టే : 
అమెరికాలో H1B ఉద్యోగాలు పోతున్నాయని, ప్రస్తుతానికి 10 శాతం వరకు ఉద్యోగాలు పోయినట్టు తన వ్యక్తిగత అంచనా మాత్రమేనని అన్నారు. 10 శాతం ఉద్యోగులపై ప్రభావం పడినట్టు కనిపిస్తోందని తాళ్లూరి జయ్ చెప్పారు. తెలుగువాళ్లు సైతం 10 శాతం ఉద్యోగాలు కోల్పోయారని జయ్ తాళ్లూరి తెలిపారు. రెండు వారాల క్రితం.. 3.3 మిలియన్ ఉద్యోగాలు ఉంటే.. వారంతా అన్ ఎంప్లాయిమెంట్ కు అప్లయ్ చేశారని చెప్పారు.

గతవారం 6.6 మిలియన్ మంది కొత్తగా అప్లయ్ చేశారన్నారు. దాదాపు 10 మిలియన్ ఉద్యోగాలు పోయినట్టు ఇప్పటివరకూ అంచనా.. ఏప్రిల్ లో మరో 10 మిలియన్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. 1982లో 10.8 శాతం నిరుద్యోగం రేటు ఉంటే.. మరో 10 మిలియన్ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు తాళ్లూరి తెలిపారు.

2.2 ట్రిలియన్ డాలర్ల స్పెషల్ ప్యాకేజీ ప్రకటన :
అమెరికాలో వ్యాపారాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం 2.2 ట్రిలియన్ డాలర్లు స్పెషల్ ప్యాకేజీ రిలీజ్ చేయడం జరిగింది. అమెరికాలో ప్రతిచోట రెస్టారెంట్లలో పనిచేసేవారు ఉంటారు.. సెలూన్స్ ఉంటాయి.. ఇవన్నీ మూసివేయడంతో అందులో పనిచేసేవారంతా ఉద్యోగాలు కోల్పోయారన్నారు.

వీరంతా అన్ ఎంప్లాయిమెంట్ ఫైల్ చేశారని చెప్పారు. ఐటీ ఉద్యోగుల్లో వర్క్ ఫ్రమ్ హోం కొనసాగుతుంది కాబట్టి ప్రస్తుతానికి సమస్య ఏది లేదని, ఇలానే సాగితే మాత్రం ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా పలు కంపెనీలు మూతపడుతున్నాయి. 

90 శాతం వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాయి.. రెసార్టెంట్లు, హోటళ్లు, ట్రావెల్ ఇండస్ట్రీలపై బారీగా దెబ్బ పడింది.. మిగతా ఇండస్ట్రీలపై కూడా ప్రభావం పడినప్పటికీ.. ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీతో 2.2 ట్రిలియన్ డాలర్లు ఇచ్చింది. అంటే.. ఒక బిలియన్ 7వేల 500 కోట్లు.. వెయ్యి బిలియన్లు అయితే ఒక ట్రిలియన్లు.. ప్యాకేజీ  రిలీజ్ చేస్తే వ్యాపారాలన్ని గాడిలోపడే అవకాశం ఉంది. అమెరికాలో ప్రభుత్వం బిజినెస్ దెబ్బతినకుండా చూస్తోందని తాళ్లూరి వివరించారు. 

indian
Telugu Employees
US
america
Coronavirus crisis
H1b Visa Employees
IT jobs

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు