ఇదే ఫస్ట్ టైం : ట్రైన్‌లో.. ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్ ఏర్పాటు

Submitted on 26 September 2019
Indian Railways Has Installed Its First Plastic Crushing Machine Inside A Train

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా భారత రైల్వే ప్రతి స్టేషన్‌లో ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తోంది. ఇదివరకే పలు రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్లను ఏర్పాటు చేసిన రైల్వే బోర్డు క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించేందుకు రైల్వే బోర్డు తగిన చర్యలు చేపట్టింది. 

అందులో భాగంగా అక్టోబర్ 2, మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్ ప్రారంభించబోతున్నారు. దేశంలోనే తొలిసారిగా PET బాటిల్ క్రషింగ్ మిషన్ ను LHB ప్యాంట్రీ కార్ (ట్రైన్ నెంబర్ 03840 వెస్ట్రన్ రైల్వేస్)లో ఏర్పాటు చేసినట్టు రిపోర్టు తెలిపింది. ఈ మిషన్ సామర్థ్యం రోజుకు 3వేల ప్లాస్టిక్ బాటిళ్లను క్రషింగ్ చేయగలదు. ఇందులో 90శాతం PET వెస్ట్ బాటిల్స్ ను రీసైకిలింగ్ చేయగలదు. క్రషింగ్ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి కార్బన్ ఫుట్ ఫ్రింట్ 100శాతానికి తగ్గిపోయిందని భారత రైల్వే ట్విట్టర్ వేదికగా తెలిపింది. 

మరోవైపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ప్రయాణికుల్లో అవగాహన కల్పించేందుకు రైల్వే ఈ దిశగా చర్యలు చేపట్టింది. కొన్ని రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్లను ఏర్పాటు చేసింది. ప్రయాణికులు ఎవరైనా వాడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ ను క్రషింగ్ మిషన్లలో వేసేలా సూచనలు చేసింది. అంతేకాదు.. క్రషింగ్ మిషన్లలో ప్లాస్టిక్ బాటిల్స్ వేసిన వారు తమ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈజీ రీఛార్జ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించింది. 

Swachh Bharat
Indian RAilways
First Plastic
Crushing Machine
train

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు