పీఓకేలో ఉగ్రవాదులతో పబ్జీ ఆడేస్తున్న భారత సైన్యం

Submitted on 23 October 2019
Indian Army Hits Terrorists Camps In PoK

సరిహద్దుల్లో భారత సైన్యం గర్జిస్తోంది. పీఓకేలో ఉగ్రవాదులతో పబ్‌జీ ఆడేస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇంతకాలం సహనంగా ఉన్నఆర్మీ. ఇప్పుడు సమరానికి సిద్ధం అవుతుంది. దాయాది పాకిస్తాన్‌ని చావు దెబ్బతీస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత దూకుడు పెంచిన భారత ఆర్మీ ఎప్పటికప్పుడు పాక్‌కి కౌంటర్ అటాక్ ఇస్తోంది. పీఓకేలో ఉగ్ర మూకలను పరుగులు పెట్టిస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో మెరుపు దాడులతో పీవోకేలో ప్రకపంనలు సృష్టిస్తోంది.

గ్రౌండ్ ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సైన్యానికి సమాచారం వచ్చింది. జైషే మొహమ్మద్, లష్కర్ ఎ తోయిబా టెరరిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నట్లు సైన్యానికి సమాచారం అందడంతో జీపీఎస్ ద్వారా పీవోకేలో పాక్ ఉగ్ర శిబిరాలను గుర్తించిన భారత సైన్యం. ఉగ్రవాదుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. సాధారణ పౌరుల కదిలికలు ఉగ్రవాదులు కదలికలూ ఎప్పుడూ భిన్నాంగా ఉంటాయి.

దీంతో అక్కడ ఉన్నవి ఉగ్రవాద శిబిరాలే అని నిర్ధారణకు వచ్చి వాటిపై మెరుపుదాడులు చేస్తున్నారు. కుప్వారా తంగ్ధర్ సెక్టార్ ఎదురుగా ఉన్న నీలం లోయలోని టెర్రర్ లాంచ్ ప్యాడ్లు ఫిరంగి దాడుల్లో ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో పదిమందికి పైగా పాక్ ఉగ్రవాదులు బలయ్యారు. నీలం వ్యాలీలో జైష్ఎ మొహమ్మద్ , లష్కర్ఎ తైబా, అల్ బదర్ ఉగ్రవాదులకు చెందిన నాలుగు స్థావరాల్లో మూడు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

పాకిస్తాన్ సైన్యం అర్ధరాత్రి అంబులెన్సులను ఉపయోగించి.. ఉగ్రమూకల మృతదేహాలు ఆ ప్రదేశం నుంచి తీసుకుని వెళ్లాయి. మరోవైపు టెర్రర్ లాంచ్ ప్యాడ్ లపై భారత సైన్యం దాడి చేయలేదని చెబుతోంది పాకిస్తాన్. భారత్ అబద్ధాలు ఆడుతోందని అంటోంది. ఇదిలా ఉంటే జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత సాగిస్తుంది భారత సైన్యం. త్రాల్‌లో భారత భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అన్సార్‌ ఘజ్వాత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్ర సంస్థకు చెందిన ముగ్గురు ముష్కరులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. 
 

INDIAN ARMY
Terrorists Camps
pok

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు