భారత్ క్లీన్ స్వీప్: చరితకు శ్రీకారం.. వైట్ వాష్ చేసిన ఫస్ట్ కెప్టెన్

Submitted on 22 October 2019
India won by an innings and 202 runs

భారత పర్యటనలో భాగంగా మూడు టీ20లు మూడు టెస్టులు ఆడేందుకు వచ్చిన సఫారీలకు చుక్కలు చూపించారు భారత ఆటగాళ్లు. వర్షం కారణంగా ఒక టీ20 రద్దు కాగా 1-1సమంగా సిరీస్ ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత టెస్టు ఫార్మాట్ లో భాగంగా ఆడిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ ఘున విజయం సాధించింది. సిరీస్‌ను వైట్ వాష్ దిశగా చేసింది.

టెస్టు క్రికెట్ లో భారత్ చరిత్ర సృష్టించింది.  ఫాలో ఆన్‌లో భాగంగా 8 వికెట్ల నష్టానికి 131 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన సఫారీలు.. రెండు పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. దీంతో భారత్ ఒక ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో భారీ విజయాన్ని దక్కించుకుంది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లతో రాణించగా..కొత్త బౌలర్ షబాజ్ నదీమ్ 2 వికెట్లు తీసుకున్నాడు. 

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ ను 497పరుగుల వద్ద డిక్లేర్ చేసి.. సఫారీలను ఘోరంగా కట్టడి చేసింది భారత్. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్‌ను 162పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 335 పరుగుల ఆధిక్యం లభించింది.

దీంతో సఫారీలకి ఫాలోఆన్‌ తప్పలేదు. రెండో ఇన్నింగ్స్‌ కూడా కష్టాలతోనే మొదలైంది. ఫాలో ఆన్‌లో కూడా కేవలం 133పరుగులు మాత్రమే చేయగలిగింది. మూడో టెస్టులో ఒక్క మూడో రోజే 16 వికెట్లు తీసుకుని భారత్ ఘనచరితకు శ్రీకారం చుట్టింది.

ఇక ఈ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా రోహిత్ శర్మ నిలిచారు. ఇక దక్షిణాఫ్రికాను టెస్టుల్లో వైట్ వాష్ చేసిన తొలి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రికార్డులకు ఎక్కాడు. 

WHITE WASH
india
South Africa
3rd Test
South Africa tour of India

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు