వరల్డ్ రికార్డు సృష్టించిన టీమిండియా

Submitted on 14 October 2019
India vs South Africa: India Set New World Record With Test Series Win Over South Africa

టీమిండియా వైజాగ్, పుణె స్టేడియాల వేదికగా ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఆదివారం పుణె వేదికగా ముగిసిన రెండో టెస్టును 137పరుగుల తేడాతో గెలుపొందింది.  మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా 2-0తో దిగ్విజయంగా సాగిపోతుంది. తొలి ఇన్నింగ్స్‌లోనే భారీ స్కోరు సాధించి ఫాలో ఆన్ ఇచ్చిన టీమిండియా సఫారీలను 189పరుగులకే చాపచుట్టేసింది. 

ఈ విజయంతో కలిపి భారత్ 11టెస్టు వరుస విజయాలను అందుకున్నట్లు అయింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ జట్టు 10టెస్టు మ్యాచ్ వరుస విజయాలకు మించి నమోదు చేయలేకపోయింది. సొంతగడ్డపై 1994, 2001, 2004, 2008లలో వరుస విజయాలతో ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేసింది భారత్. 

బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లోనే విజృంభించింది. మూడు టెస్టుల్లో భాగంగా చివరి మ్యాచ్‌ను అక్టోబరు 19న రాంచీ వేదికగా ఆడనుండగా ఇప్పటికే విజయం ఖరారు అయిపోయింది. మిగిలిన మ్యాచ్‌ను పరువు నిలుపుకునేందుకు సఫారీలు, క్వీన్ స్వీప్ చేసేందుకు భారత ప్లేయర్లు ఆడనున్నారు. ఫుల్ ఫామ్ లో కనిపిస్తున్న భారత్ ముందు దక్షిణాఫ్రికా ఏ మేర నిలుస్తుందో చూడాలి.

india
South Africa
World Record
Test Series

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు