బంగ్లాదేశ్ క్రికెటర్ల సమ్మె: భారత పర్యటనకు వస్తారా

Submitted on 21 October 2019
India tour in danger after Bangladesh players go on strike

అక్టోబరు 22తో సఫారీల పర్యటన ముగియనుండగా నవంబరు 3నుంచి భారత్‌తో తలపడేందుకు బంగ్లాదేశ్‌ షెడ్యూల్ ఫిక్సయింది. బృందాన్ని కూడా ప్రకటించేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. ఇదిలా ఉంటే మీడియా సమావేశం పెట్టిన బంగ్లాదేశ్ క్రికెటర్లు 11పాయింట్లతో కూడిన డిమాండ్లను ఆ దేశ క్రికెట్ బోర్డు ముందుంచారు. షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇఖ్బాల్‌తో పాటు మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మీరజ్, అరాఫత్ సన్నీ, జునైద్ సిద్ధిఖ్, ఎనామల్ హఖ్, తస్కీన్ అహ్మద్, ఎలియాస్ సన్నీ, ఫర్హాద్ రెజాలతో పాటు మరి కొందరుక్రికెటర్లతో సమావేశం ముగిసింది.

నవంబరు 3 నుంచి బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్‌లు ఆడేందుకు నిర్ణయించారు. దాంతో పాటు ఢాకా ప్రీమియర్ లీగ్ కు, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, నేషనల్ క్రికెట్ లీగ్ ల పేమెంట్ స్ట్రక్చర్ పెంచాలని, వారికి అందుతున్న సదుపాయాలు మెరుగవ్వాలనేది ప్రధాన డిమాండ్లుగా అందులో పొందుపరిచారు.  

తొలి టీ20 మ్యాచ్‌ ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో జరగనుంది. రెండో టీ20 మ్యాచ్‌ రాజ్‌కోట్ వేదికగా 7న, ఆఖరి టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా 10న జరగనున్నాయి. అన్ని టీ20 మ్యాచ్‌లూ రాత్రి 7 గంటలకి ప్రారంభంకానున్నాయి. ఇక నవంబరు 14న నుంచి ఇండోర్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. 22 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ రెండు టెస్టులూ ఉదయం 9.30 గంటల నుంచి మొదలవనున్నాయి.

సిరీస్‌లో భాగంగా తొలుత జరిగే టీ20 సిరీస్‌ కోసం ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టుని ప్రకటించగా.. భారత సెలక్టర్లు అక్టోబరు 24న టీమ్‌ని ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. 

బంగ్లాదేశ్ టీ20 జట్టు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, మహ్మద్ నయిం, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అపిఫ్ హుస్సేన్, మసదేక్ హుస్సేన్, అమినుల్ ఇస్లామ్, అర్ఫాట్ సన్నీ, మహ్మద్ సైఫుద్దీన్, అల్ అమిన్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సైపుల్లా ఇస్లామ్

India tour
bangladesh
Bangladesh players
Strike
Shakib Al Hasan

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు