ఇన్ స్టాగ్రామ్ లో ఫొటో షేర్ చేసిన ఇలియానా..లుకింగ్ హాట్ అంటున్న ఫ్యాన్స్

Submitted on 21 October 2019
Ileana D'Cruz posts new photo on Instagram. Looking hot, say fans

దేవదాసు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత టాలీవుడ్ లో సూపర్ హిట్ లు అందుకున్నవిషయం తెలిసిందే. తక్కువ సమయంలో టాలీవుడ్ లో అగ్రకథానాయికగా వెలుగొందింది ఇల్లీ బేబీ. అయితే 2012లో విడుదలైన  జులాయి,దేవుడు చేసిన మనుషులు సినిమాల్లో కన్పించిన ఈ గోవా బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు మకాం మార్చింది. 5ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. 2018లో విడుదలైన అమర్ అక్బర్ ఆంటోని మూవీలో రవితేజ సరసన నటించింది. 

పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టిన ఈ సుందరి ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. బ్లూ రొమాంటిక్ సప్పీ పాటలు వింటూ, మ్యూజిక్ వీడియోలో నన్ను ఊహించుకుంటూ కిటికీ నుండి తెలివిగా చూస్తున్నాను అనే కాప్షన్ తో ఆ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఫుల్ రెస్ఫాన్స్ వస్తోంది. షేర్ చేసిన ఫొటోలో బ్లూ కలర్ బికినీలో ఆమె ఒక గాజు కిటికీ వైపు వాలుతూ ఉన్నట్లుగా ఉంది.

ఈ ఫొటోను చూసిన నెటిజన్లు..ఇలియానా చాలా అందంగా ఉందని,ఎవర్ గ్రీన్ బ్యూటీ అని,గార్జియస్ అంటూ,లుకింగ్ హాట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఇల్లీ బేబీ..అన్నీస్ బాజ్మీ దర్శకత్వంలో వస్తున్న పాగల్ పంటి సినిమాలో అనీల్ కపూర్,జాన్ అబ్రహం సరసన నటిస్తోంది. నవంబర్-22,2019న ఈ సినిమా రిలీజ్ కానుంది. అభిషేక్ బచ్చన్ సరసన ఇలియానా నటిస్తున్న సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Ileana D'Cruz
Posts
new photo
instagram
Looking hot
fans

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు