ICMR Survey on Corona virus Cases in Greater Hyderabad

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులపై ICMR సర్వే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులపై ICMR సర్వే నిర్వహించనుంది. రేపటి నుంచి ఎన్ ఐఎన్ ద్వారా సర్వే నిర్వహించనుంది. హైదరాబాద్ లో 5 కంటైన్ మెంట్ జోన్లలో రెండు రోజులపాటు సర్వే నిర్వహిస్తారు. ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్రా ప్రాంతాల్లో 10 ప్రత్యేక టీమ్ ల ద్వారా సర్వే చేపట్టనున్నారు. పెరుగుతున్న కేసులు, నాన్ సింప్టమాటిక్ కేసులపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఐసీఎమ్ ఆర్ సర్వే పూర్తి చేసింది. 

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోకెళ్ల హైదరాబాద్ లో అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. డబుల్ డిజిట్స్ లో కేసులు రికార్డవుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. నిన్న ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఏకంగా 117 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో తెలంగాణ వాసులు 66 మంది ఉన్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారు 49 మంది, ఇద్దరు వలస కార్మికులకు వైరస్ సోకింది. అయితే..ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. 

తాజాగా కేసులు రిజిస్టర్ అయిన రాష్ట్ర వాసుల్లో జీహెచ్ ఎంసీలో 58 మంది ఉండగా, రంగారెడ్డి 5, మేడ్చల్ 2, సిద్ధిపేటలో ఒక కేసు నమోదైంది. తాజాగా ఈ వైరస్ బారిన పడి…నలుగురు చనిపోయారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 67కు పెరిగింది. మొత్తంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 వేల 256 మంది కరోనా బారిన పడ్డారు. తెలంగాణకు చెందిన కేసులు 1, 908 ఉండగా, వలస దారులకు సంబంధించనవి 175, సౌదీ అరేబియా నుంచి వచ్చినవి 143 కేసులు, సడలింపులు ఇచ్చాక విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 30 కేసులు నమోదయ్యాయి. 

Read: తెలంగాణలో కరోనా బెల్స్ : ఒక్కరోజే 117 కేసులు

Related Posts