కాలేజీలో డ్రెస్ కోడ్ వివాదం : మోకాళ్లపైకి దుస్తులు ఉన్న అమ్మాయిలకు నో ఎంట్రీ

Submitted on 16 September 2019
Hyderabad Girls College Bans Above Knee Kurtis

హైదరాబాద్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీలో డ్రెస్ కోడ్ వివాదం ముదురుతోంది. డ్రెస్ కోడ్ పాటించని విద్యార్థినులను కాలేజీ గేటు బయటే నిలిపేశారు. డ్రెస్ కోడ్ ప్రకారం అమ్మాయిలు మోకాళ్లను కవర్ చేస్తూ డ్రెస్ వేసుకోవాలి. అంటే కుర్తీలాంటి దుస్తులు ధరించాలి. ఈ మేరకు కాలేజీ యాజమాన్యం ఇటీవల డ్రెస్ కోడ్ తీసుకొచ్చింది. అయితే కొందరు విద్యార్థినులు ఈ కోడ్ ను పాటించలేదు. దీంతో వారిని కాలేజీలోకి అనుమతించడం లేదు. కాలేజీ యాజమాన్యం తీరుపట్ల స్టూడెంట్స్ మండిపడుతున్నారు. డ్రెస్ కోడ్ ఆంక్షల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ బయట భారీ నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.

నగరంలో పేరున్న ఉమెన్స్ కాలేజీలో సెయింట్ ఫ్రాన్సిస్ ఒకటి. ఈ కాలేజీలో అమ్మాయిలు ధరించే దుస్తులపై యాజమాన్యం ఆంక్షలు పెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం కాలేజీకి వచ్చే విద్యార్థినులు మోకాళ్ల కిందికి ఉండేలా కుర్తీస్ ధరించాలి. అంతేకాదు స్లీవ్‌ లెస్, షార్ట్స్ ధరించడంపై నిషేధం విధించారు. కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. డ్రెస్ కోడ్ ను అమలు చేసేందుకు మహిళా సెక్యూరిటీ గార్డులను కూడా కాలేజీ యాజమాన్యం నియమించింది. కాగా, నిబంధనలకు అనుగుణంగా దస్తులు వేసుకోని విద్యార్థులను కాస్లులకు అనుమతించడం లేదు.

డ్రెస్ కోడ్ పై పలువురు విద్యార్థులు నిరసన తెలిపారు. ఇది కరెక్ట్ కాదన్నారు. ఇంకా పాత పద్ధతులు పట్టుకుని వేలాడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మహిళల సాధికారత గురించి మాట్లాడుకుంటూనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మహిళలను అవమానించే ఇలాంటి చర్యలను అడ్డుకోవాల్సిందేనని విద్యార్థులు అంటున్నారు. డ్రెస్ కోడ్ నిబంధనను కొందరు విద్యార్థినులు సమర్థిస్తే.. కొందరు వ్యతిరేకిస్తున్నారు. డ్రెస్ కోడ్ వల్ల అంతా మంచే జరుగుతుందని కొందరు అంటున్నారు. ఇది మంచి నిర్ణయం అని అమ్మాయిల తల్లిదండ్రులు కొందరు చెబుతున్నారు. అదే సమయంలో వ్యతిరేకించే వారూ లేకపోలేదు.

Hyderabad Girls College
bans
Knee Kurtis
Long Kurtis
Dress Code
St Francis College

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు