వన్ టైం ఛార్జింగ్ : కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Submitted on 14 March 2019
huawei new smart watch one time charging Working 14 days if you are charging once

ప్రపంచం అంతా స్మార్ట్ జపం చేస్తోంది. ప్రతీ వస్తువు స్మార్టే. స్మార్ట్ వరల్డ్ లో హువావే కంపెనీ ఓ స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లో కి తెచ్చింది. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ హువావే వాచ్ జీటీ పేరుతో కొత్త స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ వాచ్ ను వన్ టైం చార్జ్ చేస్తే 14 రోజులు పనిచేస్తాయని హువావే కంపెనీ తెలిపింది.  

మార్చి 19 నుంచి సేల్.. 
ఇది వాచ్ జీటీ స్పోర్ట్స్ ఎడిషన్..వాచ్ జీటీ క్లాసిక్ ఎడిషన్ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఈ రెండు వేరియంట్లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో మార్చి 19 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. కంపెనీ వీటితోపాటు బ్యాండ్ 3 ప్రో, బ్యాండ్ 3ఈ అనే ప్రొడక్టులను కూడా మార్కెట్‌లో లాంచ్ చేసింది. కంపెనీ లైట్ ఓఎస్‌పై పనిచేసే Huawei Watch GT Sports ఎడిషన్ ధర రూ.15,990గా, క్లాసిక్ ఎడిషన్ ధర రూ.16,990గా ఉంది.
Read Also : పేటీఎం యూజర్ల పెద్ద మనస్సు : అమర జవాన్లకు రూ.47కోట్లు విరాళం

ఫస్ట్ టైం.. ఈ SmartWatch ను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.2,999 విలువైన Earphonesను ఫ్రీగా పొందొచ్చు. ఈ వాచ్‌లపై No cost EMI సౌకర్యం కూడా ఉంది. హువావే బ్యాండ్ 2 ప్రో ధర రూ.4,699గా ఉంది. ఇవి మార్చి 26 నుంచి అందుబాటులో రానున్నాయి. ఇక Huawei Band 3E ధర రూ.1,699. దీన్ని మార్చి 19 నుంచి కొనుగోలు చేయవచ్చు.

స్మార్ట్ వాచ్ స్పెషల్ ఫీచర్లు ఇవే.. 

* 1.39 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే
* 16 ఎంబీ ర్యామ్
* 128 ఎంబీ మెమరీ
* ఎన్ఎఫ్‌సీ, హార్ట్ రేట్ మానిటరింగ్ టెక్నాలజీ
* ట్రూస్లీప్ టెక్నాలజీ 
* ఒక్కసారి చార్జ్ చేస్తే 14 రోజులు వర్కింగ్ 

Hewaway
Smart Phone
March 19
Market Release

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు