బ్రేకప్ చెప్పారా?.. అయినా సోషల్ మీడియా మిమ్మల్ని వదలదు

how-social-media-makes-breakups-much-worse

ప్రేమించినవాళ్ల నుంచి దూరమైన తర్వాత ఫీలింగే బెటర్‌గా ఉంటుందంటున్నారు సింగిల్ యూత్. 2017నాటి స్టడీప్రకారం 71శాతం మంది ఇదే మాట చెబుతున్నారు. 11 వారాల తర్వాత బ్రేకప్ బాధను వాళ్లు మర్చిపోయేవాళ్లు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని జ్ఞాపకాలను వెనక్కు తీసుకెళ్లిపోతున్నాయి. ఈ హీలింగ్ ప్రొసెస్‌ను దెబ్బతీస్తూ.. మర్చిపోదామనుకున్నా, బ్రేకప్‌ను మర్చిపోనివ్వడంలేదు.

మనం కొందరికి క్లోజ్ అవుతాం. ఫ్రెండ్ షిప్ చేస్తాం. ఆ తర్వాత వాళ్లు మనకు నచ్చరు. ఇలాంటివాళ్ళను "unfriend", "block", "unfollow" చేస్తాం. హమ్మయ్య గోల వదిలిందనుకొంటాం. అలాగని social media algorithms మిమ్మల్ని వదిలేలాలేవు. మనం ఎకౌంట్స్ ఓపెన్ చేయగానే వాళ్ల పోస్టింగ్స్ మీకు కనిపించేలా చేస్తున్నాయి. రిలేషన్ షిప్ లో ఉన్నప్పటి సంగతులను పదేపదే మెమొరీస్ చూపిస్తూ, వాళ్ల పోస్ట్ లను మీముందుకు తీసుకొస్తూ ఇబ్బందిపెడుతుంటాయి. సోషల్ మీడియా కావాలని చేసేదేం కాదు. 

 

University of Colorado Boulder పరిశోధకుల దగ్గర ఈ సమస్యకు పరిష్కారముంది. సోషల్ మీడియా వ్యక్తిగత సంబంధాల మీద ప్రభావం చూపిస్తోంది. కాబట్టి, అన్నింటినీ
అల్గోరిథమ్స్ కు వదిలిపెట్టేబదులు "human-centered approach" ను వాడితే సామాజిక, వ్యక్తిగత సంబంధాలను అర్ధంచేసుకొని ఇబ్బందులను తొలగించడాని వీలువుతుంది. బ్రేక్ అప్ అంటే యంత్రాలకు ఏం తెలుసు?

అల్గోరిథమ్ మీకు ఇంతకుముందు ఇంటరాక్ట్ అయినవాళ్ల పోస్టింగ్ ను మీకు చూపిస్తూ, ఎంగేజ్ చేయాలనుకొంటాయి. ఇదే పెద్ద సమస్య. బ్రేక్ అయినప్పుడ వాళ్ల నుంచి దూరంగా మీరు వెళ్లిపోతుంటే, సోషల్ మీడియా వాళ్లను వద్దకు మీముందు తీసుకొస్తుంది.

 

సోషల్ మీడియా అల్గోరిథమ్స్ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? వాళ్ల సామాజిక, మానసిక పరిస్థితులు ఏంటో అర్ధం చేసుకోలేవు. అదే మనుషుల నడిపే అల్గారిథమ్స్ వీటికి పరిష్కారం కావచ్చు.

మరిన్ని తాజా వార్తలు