How To Be A Good Roommate

మంచి Roommateగా ఉండాలంటే 7రూల్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కాలేజీలు స్టార్ట్ అవడం, ఇళ్ల నుంచి బయల్దేరడం ఇవన్నీ చకచకా జరిగిపోతాయి. బయల్దేరి అక్కడకు వెళ్లిన తర్వాత ఎక్కడుంటాం. ఎవరితో కలిసి ఉంటాం. స్టూడెంట్లు హాస్టల్‌లో ఉన్నా.. అద్దెకు షేరింగ్ రూమ్‌లలో ఉన్నా మంచి వ్యక్తిగా, గుడ్ రూమ్మేట్ గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా.. అన్నీ పట్టించుకోవద్దు.. కొన్ని లైట్ తీసుకోవద్దు..  ఇలాంటి ఏడు రూల్స్ ఫాలో అయితే ఏ గొడవ ఉండదు. 

బేసిక్ రూల్స్ పాటించాలి:
మనం ఎవరితోనైనా కలిసి ఉంటున్నామంటే ఇద్దరూ బేసిక్ రూల్స్ పాటించాలి. ప్రతి ఒక్కరిలో విభిన్న భావాలు ఉంటాయి. అవి ఇతరుల నుంచి కంఫర్టబుల్‌నెస్ లేకుండా చేస్తాయి. వీటికి దూరంగా ఉండాలంటే కొన్ని గ్రౌండ్ రూల్స్ పాటించాలి. 

ప్రతీసారి అడుగుతూ ఉండండి:
మీరెంత క్లోజ్ గా ఉన్నప్పటికీ ఇతరుల వస్తువులు వాడుకోవాలి అనుకున్నప్పుడు అడిగి తీసుకోండి. వారి ఇష్టం మేరకే మీరు వస్తువులు వాడండి. అదే విధంగా నో చెప్పినప్పుడు వాటికి దూరంగా ఉండటమే మంచిది. 

వారి ప్రైవసీని గుర్తించండి:
ప్రతి ఒక్కరికి కాస్త ప్రైవసీకి కావలసి ఉంటుంది. అది సహజం. మీరేదో పార్టీ చేసుకోవాలనుకున్నప్పుడు రూమ్మేట్ గదిని శుభ్రం చేయాలని అంచనాలు పెట్టుకోవద్దు. పార్టీ అయిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తిని క్లీన్ చేయాలని ఆర్డర్ చేయవద్దు. 

వేరొకరిని పిలిచే ముందు చెప్పాలి:
రూమ్మేట్‌కు ఇవ్వాల్సిన కనీస మర్యాదల్లో ఇదొకటి. ఇంకొకరిని పిలిచే ముందు ముందుగానే రూమ్మేట్‌కు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 

మీరు తెచ్చుకున్నవి మాత్రమే వాడుకోండి
ఇదేమంత పెద్ద సమస్య కాకపోయినా పెద్ద వాదనలకు మాత్రం కారణం అవుతుంది. మీరు సొంత డబ్బుతో కొనుక్కుని తీసుకురానంత వరకూ వేరొకరి వస్తువులను వాడుకోకండి. అది ఆహారం, మేకప్ ఎలాంటివైనా సరే. 

కమ్యూనికేషన్
అన్నిటికంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. వాదనలకు దూరంగా పాజిటివ్ కామెంట్లతో కమ్యూనికేట్ అవ్వండి. మీ రూమ్మేట్ ప్రతిసారి విసిగిస్తుంటే అది సరైన పద్ధతిలో అతనికి తెలియజేయండి. సింపుల్.

Read: శానిటైజర్లు అతిగా వాడినా ప్రమాదమే