షాద్ నగర్ కోర్టు దగ్గర ఉద్రిక్తత : భారీగా తరలి వస్తున్నారు

Submitted on 2 December 2019
high tension at shadnagar court

షాద్ నగర్ కోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు భారీగా కోర్టు దగ్గరికి తరలి వస్తున్నారు. దిశ హత్యాచారం కేసులో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై షాద్ నగర్ కోర్టు విచారణ జరపనుంది. నిందితులను 10 రోజుల కస్టడీకి తమకు అప్పగించాలని పిటిషన్ లో పోలీసుల కోరారు.

కస్టడీ పిటిషన్ పై విచారణ సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో కోర్టు దగ్గరికి వస్తున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా కోర్టు దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరించారు. దిశ హత్యాచారం కేసు నిందితుల తరఫున వాదించకూడదని, వారికి న్యాయ సాయం చేయకూడదని లాయర్స్ బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. ప్రస్తుతం నలుగురు నిందితులు చర్లపల్లి జైల్లో ఉన్నారు.

శంషాబాద్ లో చోటు చేసుకున్న దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దిశకు న్యాయం చేయాలని, నిందితులకు ఉరే సరి అనే నినాదాలతో హోరెత్తుతోంది. ఈ కేసులో మహ్మద్‌ ఆరిఫ్‌, జొల్లు శివ, జొల్లు నవీన్‌, చింతకుంట చెన్నకేశవులుకి 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. చర్లపల్లి జైల్లో ఉన్న వీరిని  వేర్వేరు చీకటి గదుల్లో బంధించారు. భద్రతారిత్యా వారికి హైసెక్యూరిటీ ఇచ్చారు. ఒక్కొక్కరికి ఇద్దరు వ్యక్తులను నియమించారు పోలీసులు. 

వెటర్నరీ డాక్టర్ హత్యాచారం కేసులో పోలీసులు మృతురాలి పేరుని మార్చిన సంగతి తెలిసిందే. ఇకపై ‘జస్టిస్ ఫర్ దిశా’గా పిలవాలని సూచించారు. గతంలో నిర్భయ, అభయ పేర్లలాగానే దిశగా పేరు మార్చారు పోలీసులు. హత్యాచారం కేసుల్లో చట్టాన్ని ఉద్దేశించి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

High Tension
shadnagar court
disha
Veterinary doctor
Police Custody
Rape
murder
cops
Shamshabad
Hyderabad

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు