Hero Ajith and Shalini hospital visit

కరోనా టైం : ఆసుపత్రికి వెళ్లిన అజిత్ దంపతులు..వీడియో వైరల్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రముఖ నటుడు, తమిళ స్టార్ తలా అజిత్, సతీమణి షాలినీతో కలిసి ఆసుపత్రికి వెళ్లడం అక్కడ హాట్ టాపిక్ అయ్యింది. ముఖాలకు మాస్క్ లు కట్టుకుని ఆసుపత్రికి వచ్చిన వెళుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. నగరంలోని ఓ ఆసుపత్రికి వచ్చిన వీరిని కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ అయ్యింది. కానీ ఆసుపత్రికి ఎందుకు వచ్చారనేది తెలియరావడం లేదు. అజిత్ తండ్రికి అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని..చూసేందుకు అజిత్ దంపతులు వచ్చారనే ప్రచారం జరుగుతోంది. 

భారతదేశంలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. తమిళనాడులో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఈ టైంలో అజిత్ దంపతులు హాస్పిటల్ కు వెళ్లే సరికి ఆయన అభిమానులు ఫుల్ టెన్షన్ పడ్డారు. అజిత్ దంపతులకు ఏమైందనే టెన్షన్ కు లోనయ్యారు. కరోనా వైరస్ పోరులో భాగంగా అజిత్ పీఎం కేర్స్ కు రూ. 1.25 కోట్ల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. మే 01వ తేదీన అజిత్ 49వ ఏట అడుగు పెట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపవద్దని అజిత్ అభిమానులకు సూచించారు. 

అజిత్ ప్రస్తుతం వినోద్ దర్శకత్వంలో వలిమై సినిమాలో నటిస్తున్నారు. బోనీ కపూర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నెర్కోండ పార్వై (పింక్ రీమెక్) మంచి విజయం సాధించడంతో వలిమై సినిమాపై అంచనాలు పెరిగాయి. 
 

Related Posts