వేర్వేరు ప్రాంతాల్లో హెలీకాప్టర్, ఆర్మీ వెహికల్ ప్రమాదాలు

Submitted on 23 August 2019
Helicopter and Army Vehicle Accidents in Different Areas Himachal Pradesh..Uttarakhand

రోజు పలు ప్రమాదాలు జరుగుతునే ఉంటాయి. ఈ క్రమంలో ఓ హెలీకాప్టర్ కూలిపోయింది. మరో ప్రాంతంలో ఓ మిలటరీ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ రెండు ప్రమాదాలు వేరు వేరు ప్రాంతాల్లో జరిగాయి. ఉత్తరాఖండ్ లో హెలీకాప్టర్ కూలిపోగా సిమ్లాలో మిలటరీ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదాల్లో  ఒక ఆర్మీ జవాన్ మృతి చెందగా మొత్తం ఐదుగురికి గాయాలయ్యాయి.

ఉత్త‌రాఖండ్‌లో ఇవాళ ఓ హెలికాప్ట‌ర్ కూలిపోయింది. స‌హాయ‌క సామాగ్రి మోసుకువెళ్తున్న ఆ హెలికాప్ట‌ర్ టికోచి ఏరియాలో నేల‌కూలింది. ప్రమాద సమయంలో చాపర్ లో ఉన్న పైల‌ట్‌తో స‌హా కోపైల‌ట్ స్వ‌ల్ప గాయాల‌కు గుర‌య్యారు. అలాగే హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని సిమ్లా స‌మీపంలో మిలిట‌రీ వాహ‌నం ఒక‌టి రోడ్డుపై స్కిడ్ అయ్యింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ ఆర్మీ జ‌వాను మృతిచెందాడు. మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. గాలు నుంచి లంబీదార్ మ‌ధ్య ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

helicopter
and Army Vehicle
Accidents Himachal Pradesh..Uttarakhand

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు