జాగ్రత్త : ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు

Submitted on 22 October 2019
heavy rains for telugu states

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 48 గంటల్లో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండంగా మారాక ఏపీ వైపు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రానున్న మూడు రోజులు తెలంగాణ, రాయలసీమ, కోస్తాలో వానలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.

మంగళవారం(అక్టోబర్ 22,2019) హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు నీటితో నిండిపోవటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం పూర్తిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్మేశాయి. నగరవ్యాప్తంగా వాన కురిసింది.

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ముసురుపట్టింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో వాన దంచి కొట్టింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వర్షం పడింది. అల్పపీడనం ప్రభావంతో బుధవారం(అక్టోబర్ 23,2019) కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Rains
Telangana
Andhra Pradesh
Weather

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు